దారుణం. సెల్ ఫోన్లు పెలి నలుగురు పిల్లలు దుర్మరణం.. ఫోన్లతో జాగ్రత్త..

దారుణం. సెల్ ఫోన్లు పెలి నలుగురు పిల్లలు దుర్మరణం.. ఫోన్లతో జాగ్రత్త..

జనం న్యూస్: ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయో ఎవ్వరం చెప్పలేము. అకస్మాత్తుగా జరిగే కొన్ని ప్రమాదాలు పెను విషాదాలను మిగులుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాల పేలుడు ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మొబైల్స్, ల్యాప్ ట్యాప్ వంటి పరికరాలు పేలి..కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. గతంలో మొబైల్ ఫోన్ పేలిపోయి పలువురు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ఏకంగా నలుగురు చిన్నారులు ఈ మొబైల్ పేలుడుకు బలయ్యారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చేలరేగాయి. అక్కడే ఉన్న మంచానికి నిప్పులు అంటుకోవడంతో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డాడరు వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుత నలుగురు మృతి చెందారు. మరణించిన చిన్నారులు సారిక(12), నిహారిక(8),శంకర్(6), కల్లు(5)గా గుర్తించారు. ఇక వారిని కాపాడేందుకు వెళ్లిన తల్లిదండ్రులైన జానీ(39), బబిత(35)లు కూడా తీవ్రంగా గాయపడ్డాడరు. జానీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అలానే బబిత కు 60శాతం గాయాలయ్యాయి. ఆమెను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మీరాట్ జిల్లాలోని పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే జనతా కాలనీలోని ఓ ఇంట్లో జానీ, బబిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నిహారిక, గోలు, సారిక, కల్లు అనే నలుగురు పిల్లలు ఉన్నారు. జానీ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తున్నారు. ముజఫర్ నగర్ కు చెందిన జానీ ఉపాధి కోసం పల్లవపురం ప్రాంతానికి వచ్చాడు. అతను చాలా ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో జానీ పిల్లలు మంచంపై ఆడుకుంటున్నారు. ఆ నలుగురిలో ఓ చిన్నారి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. అప్పుడు మొబైల్ లీడ్, ఛార్జర్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. మంటలు మంచంకు ఉన్న పరుపుకు అంటుకున్నాయి. దీంతో క్షణాల్లో చూస్తుండగానే పెద్ద పెద్ద నిప్పులు రవ్వలుగా మారాయి. మంచంపై కూర్చున్న పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు ఇక మంటల్లో చిక్కుకున్న పిల్లలు కాపాడేందుకు జానీ, సబితాలు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటికే పిల్లలు తీవ్రంగా గాయపడి ఉన్నారు. నలుగురు పిల్లలు, ఆ దంపతులు గాయపడగా..వారిని వెంటనే పల్లవపురంలోని ఫ్యూచర్ ఫ్లస్ అనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ నలుగురు చిన్నారులు మరణించారు. పిల్లలను కాపాడేందుకు వెళ్లి తీవ్రంగా గాయపడిన జానీ పరిస్థితి విషయంగా ఉంది. అలానే సబిత కూడా 60 శాతం కాలిన గాయలతో చికిత్స పొందుతుంది. మొత్తంగా మొబైల్ పేలుడు ఘటన ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది.