అబ్బా ఎం తెలివిరా సామీ మీది.. పిల్లాడి కోసం ఇతను చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..

జనం న్యూస్: కితకితలు లేకుండానే సరదాగా గడపాలనుకునేవారికి సోషల్ మీడియా ఓ వరంలా దొరికింది. అలా ఓపెన్ చేశామో లేదో.. అందులోని కొన్ని వీడియోలు ఎంతటివారినైనా నవ్వించేస్తాయి. అయితే మరి కొన్ని వీడియోలు మానవాతీతంగా ఉంటాయి. వీడియోలోని వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు లేదా చేసే పనులు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను మళ్లీ మళ్లీ చూసేలా చస్తోంది. అవును, ఆ వీడియోలోని ఓ స్త్రీ చేసిన పనిని చూస్తే మరో సారి చూడడంతో పాటు ఆశ్చర్యపోవడం ఖాయం. అవును, అసలు ఈ వీడియోలో ఏం జరిగిందంటే.. ఓ మహిళ ఐస్‌క్రీమ్ కొన్నది. అయితే దాన్ని తన చిన్ని కొడుకుకు ఇస్తే కింద వేస్తాడని ఆలోచించిన ఆ తల్లి ఐస్‌క్రీమ్‌ని తెలివిగా కట్ చేస్తుంది. ఎలా అంటే ఐస్‌క్రీమ్ కోన్ అడుగున ఉన్న కొంత భాగాన్ని కట్ చేసి అందుకు క్రీమ్ పెట్టి ఆ బుడ్డోడికి అందిస్తుంది. అలా సాగిన వీడియో కొన్ని సెకన్లే ఉన్నప్పటికీ ఇది నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్నోడికి చిన్న సైజ్ ఐస్‌కీమ్ అని, దాన్ని వాడు ఎలా అయినా విసిరేస్తాడని, వావ్ చిన్న చిన్న పనులే చిన్నోళ్లని సంతోషంగా ఉంచుతాయని, ఆమె వేసిన ప్లాన్ సూపర్ అని, ఆ తల్లి తన కొడుకునే మోసం చేసి మిగిలినది తినేయాలని ప్లాన్ వేసిందని పలువురు నెటిజన్లు రాసుకొచ్చారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 4 లక్షల 83 వేల లైకులు, 70 లక్షల వీక్షణలు లభించాయి.