రహస్యంగా సమంతా రెండవ పెళ్లి...? వరుడు ఎవరో తెలుసా.. ?

రహస్యంగా సమంతా రెండవ పెళ్లి...? వరుడు ఎవరో తెలుసా.. ?

జనం న్యూస్: అక్కినేని నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న దగ్గర నుండి సమంత కి సోషల్ మీడియా లో మన గాసిప్ రాయుళ్లు ఇప్పటి వరకు ఎంత మందితో ఆమెకి రెండవ పెళ్లి చేయించారో లెక్కే లేదు.ఇప్పటికీ ఈమె రెండవ పెళ్లి చేసుకుంటుంది అంటూ పలు రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉంటాయి,అలా రాసే గాసిప్ రాయుళ్లకు ఇప్పుడు మరింత స్టఫ్ ఇచ్చేసింది సమంత.అసలు విషయానికి వస్తే సమంత మేడలో తాళిబొట్టు మరియు నల్లపూసల దండ లేటెస్ట్ ఫోటోలలో ఉండడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ఇదేంటి సోషల్ మీడియా లో రోజు వస్తున్నవి రూమర్స్ కాదా?, నిజంగా సమంత ఎవరికీ తెలియకుండా రహస్యం గా పెళ్లి చేసుకుందా?,ఇదెక్కడి ట్విస్ట్ అండీ బాబోయ్ అంటూ అభిమానుల దగ్గర నుండి ప్రేక్షకుల వరకు అందరూ మాట్లాడుకుంటున్నారు.మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధితో గత కొంతకాలం నుండి పోరాటం చేస్తూ వచ్చిన సమంత, ఇప్పుడు ఆ వ్యాధి నుండి బయటపడి వరుసగా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.రీసెంట్ గానే ఆమె విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన కొన్ని ఫోటోలు షూటింగ్ సెట్స్ నుండి లీక్ అయ్యాయి.ప్రస్తుతం సమంత మరియు విజయ్ దేవరకొండ మీద పెళ్లి సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అందుచేతనే ఆమె మేడలో పసుపు తాడుతో కూడిన తాళిబొట్టుని ధరించిందే తప్ప, నిజంగా పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాయి సమంత సన్నిహిత వర్గాలు.ఈ సినిమాతో పాటుగా ఆమె పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది.అమెజాన్ ప్రైమ్ సంస్థ తెరకెక్కిస్తున్న’సీటా డెల్’ లో ఆమె ఒక పవర్ ఫుల్ రోల్ చేస్తుంది.ఇటీవలే ఈ సిరీస్ కి సంబంధించిన ఒక కీలక షెడ్యూలు లో పాల్గొని షూటింగ్ పూర్తి చేసింది సమంత.