రాత్రి అయితే చాలు గ్రామస్థులకు నిద్ర లేకుండా చేస్తున్న దెయ్యం.. అసలు ఎం జరుగుతోంది..?
జనం న్యూస్: ఆ ఊరి జనాలను దెయ్యం భయం వణికిస్తోంది. రాత్రైతే చాలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడుపుతున్నారు. చీకటి పడగానే వింత శబ్దాలు, వికృత రూపాలు కనిపింస్తున్నాయంటూ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కాస్త ధైర్యం చేసిన కుర్రాళ్లు రాత్రుళ్లు పహారా కాయగా.. వారికి ఓ వింత ఆకారం కనిపించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో గ్రామస్థులకు దెయ్యం భయం పట్టుకుంది. ఆ గ్రామంలో రాత్రిపూట దెయ్యం తిరుగుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. రాత్రిపూట 12 గంటలు దాటిన తర్వాత వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అసలు ఆ కథ ఏంటో తేల్చాలని భావించిన ఆ ఊరిలోని యువకులు రాత్రులు పహారా కాయడం మొదలు పెట్టారు. అలా రాత్రిపూట పహారా కాస్తున్న యువకులకు ఆ ఊరి స్కూల్ భవనంపై ఓ నీడ కనిపించింది. అక్కడ ఎవరూ లేకపోయినా గోడ మీద నీడ ఎలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. వెంటనే వారు ఆ నీడను ఫోన్ లో వీడియో తీశారు. ఆ వీడియో గ్రామస్థులకు చూపించారు. ఆ దృశ్యాలు చూసిన తర్వాత గ్రామస్థుల భయం మరింత బలపడింది. నిజంగానే వారి గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇదంతా కొందరు ఆకతాయిల పనా? లేక నిజంగానే వింత శబ్ధాలు వినిపిస్తున్నాయా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.