రోజు రోజుకూ ఇలా దిగజారి పోతున్నారు ఏంట్రా మీరంతా..! సిగ్గు ఉండాలి కాస్తైనా మీకు..

జనం న్యూస్: ఈ మధ్య కొంతమందికి పిచ్చి పట్టింది. సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్‌ అవ్వాలనే తాపత్రయంతో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో తింగరి వేషాలు వేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. మెట్రోరైళ్లలో, రోడ్డుమీద ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఓ యువతి, యువకుడు చేసిన పనికి పోలీసులు వారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అదేంటో తెలుసుకుందాం పదండి. మహారాష్ట్ర థానే ఉల్లాస్‌నగర్‌లోని ఓ సిగ్నల్‌ వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. స్కూటీపై వెళ్తున్న యువతి, యువకుడు నడిరోడ్డుమీద బకెట్‌తో నీళ్లు తీసుకొని స్కూటీమీద వెళ్తూ స్నానం చేశారు. స్కూటీ వెనక కూర్చున్న యువతి బకెట్‌లో నీటిని తానూ పోసుకుంటూ.. ఆ యువకుడి మీద పోస్తోంది. దారినపోయేవాళ్లంతా వీళ్ల పిచ్చి వేషాలు చూసి తెగ నవ్వుకున్నారు. కొందరితే పిచ్చి పట్టిందా అని కామెంట్ చేశారు. ఆ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారి పోలీసుల కంటపడింది. వీ డిజర్వ్‌ బెటర్‌ గవర్నమెంట్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌ నుంచి ఈ వీడియో థానే నగర పోలీసులకు చేరింది. ఇంత జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకోరు కదా.. వెంటనే రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆ వీడియోను షేర్‌ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నడిరోడ్డుపై పబ్లిక్‌ న్యూసెన్స్‌కు పాల్పడడిన కారణంగా వారిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే.. హెల్మెట్‌ ధరించకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసులు సైతం వారిపై కేసు నమోదు చేసి ఛలానా విధించారు. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముంబైకి చెందిన యూట్యూబర్‌ ఆదర్శ్‌ శుక్లా అట. తాను చేసిన పనికి సారీ చెబుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశాడు. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఏముంటుంది చెప్పండి.. అందుకే సారీ చెప్పినా చర్యలు తప్పవని థానే పోలీసులు స్పష్టం చేసారు.