సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో

సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో

జనం న్యూస్ :నవంబర్ 20 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ జిల్లా ఇన్చార్జి అరుముల్ల పొశం తెలంగాణలో బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం జరుగుతుందని ధిమా వక్తం చేశారు. రైతులకు వారి ధన్యంకు మద్దతు ధర 3100, ఆడపిల్ల పుడితే 21 సంవత్సరాలనాటికి రూపాయలు రెండు లక్షలు అధిస్తమని , మహిళలకు రాష్ట్రంలో ఒక్క పర్సెంట్ తోటి రుణాలు అందిస్తామని, రాష్ట్రంలోని పన్నెండు లక్షల గాస్ కనేశన్లకు 4సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని అన్నారు, ఇంటర్ ఇడియట్ అపై చదువుకునే విద్యార్థినులకు లాప్టాప్ లు ఎలక్ట్రిక్ స్కూటీలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు, తెలంగాణలో డీజిల్ కు పెట్రోల్ కు 15 రూపాయలు తగ్గిస్తామని అన్నారు దీనివలన రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని వస్తువులపై రేట్లు తగ్గుతాయని మధ్యతరగతి జనాలకు అందుబాటులో వస్తుందని అన్నారు జిల్లా లోని రెండు నియోజకవర్గాలలో బిజెపి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణకుమారి జిల్లా ప్రధాన కార్యదర్శి చెర్ల మురళీధర్ తాలూకా ప్రబారి వెంకట రమణ పార్లమెంట్ కోకన్వీనర్ కొలిపాక కిరణ్ తాలూకా కన్వీనర్ సొల్లు లక్ష్మి జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రేవూరి నరసింహారెడ్డి విస్తారక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.