125 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరిక.. -

125 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరిక.. -

- పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన జీవి ఆంజనేయులు

 జనం న్యూస్.. జనవరి 23.. వినుకొండ..

వినుకొండ...పట్టణంలోని2,12,16,29,30 వార్డుల్లో సంజయ్ గాంధీ నగర్, హనుమాన్ నగర్, నవాజ్ కుంట, మాస్టిన్ కాలనీ, అంబేద్కర్ నగర్ కు చెందిన 125 కుటుంబాలు అధికార వైసీపీని వీడి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు ముళ్ళమూరు బస్టాండ్, నరసరావుపేట రోడ్డు, చెక్పోస్ట్ సెంటర్, శివయ్య స్తూపం సెంటర్తో పాటు ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి కొత్తపేటలోని టిడిపి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు మరియు రాష్ట్ర మైనార్టీ సెల్ టిడిపి అద్యక్షులు మౌలానా సుస్తాక్ అహ్మద్ సమక్షంలో సంజయ్ గాంధీ నగర్ 30వ వార్డు వైసిపి కన్వీనర్ బత్తుల శ్రీను, తిరుమలయ్య, మాస్తిన్ కాలనీ బాజీ, వెంకటేష్, బత్తుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 125 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కే,దుర్గారావు,బి.దుర్గారావు ,దుర్గ కోటేశ్వరరావు ,శ్రీకాంత,అనిల్,చాంద్,నాగూర్ బాష,దుర్గారావు.బండ రవి ఇంకా పలు కుటుంబాలు టిడిపిలో చేరగా పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు గారు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ అరాచక జగన్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడి బ్రతుకు పోరాటానికి అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు అనేక అసత్య వాగ్దానాలు చేసిన జగన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పోకడ, వినుకొండలో వైసిపి నేత అరాచక వ్యవహార శైలి పై అసంతృప్తి చెంది వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు టిడిపిలో చేరుతున్నారని తెలిపారు. జనరంచక పాలనకు చంద్రబాబు రాష్ట్రానికి శరణ్యమని ప్రజలు భావించి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి సాగనంపెందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం పురోగమన దిశగా ముందుకు సాగాలంటే భావితరాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన- టిడిపి సంయుక్త ప్రభుత్వం వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు.

వైసీపీ నుండి టిడిపిలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పోకడ చూస్తే భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుందని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన పాలకులు ప్రశ్నించిన వారిపై దాడులు, తప్పుడు కేసులు , దౌర్జన్యాలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. వినుకొండలో జీవి ఆంజనేయులు గారిని ఎమ్మెల్యే, మంత్రిని చేసేందుకు, సీఎం చంద్రబాబు గారిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. టిడిపి నాయకులు కార్యక్రమంలో సౌదాగర్ జాని బాష, కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు, సుబ్బారావు, పట్టణ కార్యదర్శి పువ్వాడ కృష్ణ, చికెన్ బాబు, కారుపల్లి శ్రీను, పులగం శ్రీను, పి.వి.సురేష్ బాబు , లగడపాటి శ్రీను, గంగినేని రాఘవ,రియలెస్టేట్ జాని.తూమాటి కాసి.31 వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ రామారావు,దావీదు,మోతమర్రు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.