_ఆడపడుచులకు ఇచ్చిన వై.యస్.అర్ ఆసరా పథకం హామీనీ పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం_

_ఆడపడుచులకు ఇచ్చిన వై.యస్.అర్ ఆసరా పథకం హామీనీ పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం_

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి చేతులు మీదుగా నేడు ఉరవకొండ నియోజకవర్గంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వై.యస్.అర్ ఆసరా పథకం చివరి 4వ విడత ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గల స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మలు ఖాతాల్లో 6394.83 కోట్ల రూపాయలు నేరుగా జమ, గతంలో చెప్పిన విధంగా 4వ విడత కలుపుకుని మొత్తంగా ఈ నాలుగేళ్ల కాలంలో 78,94,169 లక్షల మంది అక్కాచెళ్ళమ్మల ఖాతాల్లో 25,571/- కోట్ల రూపాయలు జమ చేసి దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రీతిలో చేసి చూపిన గొప్ప నాయకులు,సీఎం వైయస్ జగన్.

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వై.యస్.అర్ ఆసరా పథకం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు , జిల్లా కలెక్టర్ నిసాంత్ కుమార్ల చేతులు మీదుగా మన్యం జిల్లాలో గల 16,669 స్వయం సహాయక సంఘాలకు 94.33 కోట్ల రూపాయల నమూనా చెక్కును అక్కాచెళ్ళమ్మలకి అందుచేత. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.