
జనం న్యూస్ : అక్టోబర్ 23(రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్).ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు సబ్-డివిజన్ అధికారులతో స్టేషన్ రికార్డులు, క్రైమ్ డేటా, మైగ్రేషన్ మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఒంగోలు డి.ఎస్.పి రాయపాటి శ్రీనివాస్ రావు జిల్లాలో పోలీస్ స్టేషన్ల రికార్డులు, ప్రొఫైల్/క్రైమ్ డేటా, మైగ్రేషన్ డేటా మరియు గ్రామ/వార్డు ప్రొఫైల్స్ సమగ్ర నిర్వహణ కోసం సబ్-డివిజన్ అధికారులు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో డేటా ఖచ్చితత్వం, సమయానుకూల అప్‌డేట్ మరియు ప్రజల భద్రతకు మరింత సమర్థమైన పోలీసింగ్ విధానాలుపై చర్చలు జరిపి, పోలీస్ శాఖ దృష్టి మరియు ప్రణాళికలను పునఃప్రతిపాదించారు.ఈ సమావేశం ద్వారా ప్రజల కోసం వేగవంతమైన, సమగ్ర మరియు సాంకేతిక ఆధారిత పోలీసింగ్ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యం అని తెలిపారు.

