
జనం న్యూస్ (అక్టోంబర్ 24 పెబ్బేరు :రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే ఎన్నో ఏళ్ల నాటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ సొంత భవన నిర్మాణం కల నేడు వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారి ప్రత్యేక చొరవ వలన సహకారం అయింది ఎంతో ఘనచరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు జిల్లా కార్యాలయం లేకపోవడంతో చెలించిపోయిన ఆయన తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి,సంబంధిత శాఖ మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్లారు తన అభ్యర్థనకు స్పందిస్తూ వనపర్తి పట్టణ శివారు రాజపేట లోని 73/2 సర్వే నెంబర్ లోని 1 ఎకరం భూమిని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు త్వరలోనే 73/2 సర్వే నెంబర్లో గల స్థలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంకు సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి సహకరించిన జూపల్లి కృష్ణారావు గారికి, వాకిటి శ్రీహరి గారికి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి ,ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేశరు


 
	 
						 
						