
జనం న్యూస్ : భారీ బ్యాటరీతో బెస్ట్ గేమింగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? పవర్‌ఫుల్ ప్రాసెసర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
కొత్త గేమింగ్ ఫోన్ల కోసం చూస్తున్నారా? 7000mAh లాంగ్ బ్యాటరీ బ్యాకప్, పవర్‌ఫుల్ గేమింగ్ ప్రాసెసర్‌లతో 5 బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్లు బెస్ట్ కెమెరా సెటప్‌తో లభ్యమవుతున్నాయి. రియల్‌మి 15టీ 5జీ నుంచి రియల్‌మి P4 వరకు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ప్రస్తుత ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
1. రియల్‌మి 15T 5G : ఈ రియల్‌మి 15T 5జీ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో (Best Gaming Smartphones) వస్తుంది. 6.57-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లే కలిగి ఉంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 7000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమన్షిటీ 6400 మ్యాక్స్ ప్రాసెసర్ కలిగి ఉంది. భారీ గేమింగ్ మల్టీ టాస్కింగ్ కోసం వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ రియల్‌మి ఫోన్ 8శాతం తగ్గింపుతో కేవలం రూ. 20,999కి కొనేసుకోవచ్చు.
2. రియల్‌మి 15x 5G : రియల్‌మి 15x 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 1TB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా లభిస్తాయి. ఈ ఫోన్ 7000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6300, 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 9శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 19,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
3. రియల్‌మి P4 ప్రో 5జీ : రియల్‌మి P4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. రోజువారీ వినియోగానికి భారీ గేమింగ్‌కు అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. బ్యాక్ సైడ్ 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 50MP ల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ రియల్‌మి ఫోన్ 7000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 17శాతం తగ్గింపుతో కేవలం రూ. 23,999కు లభిస్తుంది.
4. ఒప్పో K13 5G : ఒప్పో K13 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 7000mAh లాంగ్-లాయింగ్ బ్యాటరీ ప్యాక్, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పొందవచ్చు. ప్రత్యేకించి గేమర్స్ కోసం ఈ ఒప్పో ఫోన్ అందిస్తోంది. 7.9L+ AnTuTu స్కోరు కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20శాతం తగ్గింపుతో కేవలం రూ. 19,999కి కొనుగోలు చేయవచ్చు.


 
	 
						 
						