
జనం న్యూస్ : అక్టోబర్ 22 (రిపోర్టర్ : కొత్తమాసు అజయ్ కుమార్). జై స్వరాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అధ్యక్షుడి గా ఏకగ్రీవంగా మేకల అమర్నాథ్ యాదవ్ ను ఎన్నుకోవడం జరిగిందంటూ జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు ” కాసాని శ్రీనివాసరావు ” మంగళవారం నాడు విజయవాడలోని జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర కన్వీనర్ గా ఎంపికైన ” మేకల అమర్నాథ్ యాదవ్ ” ను అభినందించడం జరిగింది.వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో విస్తృత అనుభవం ఉన్న అమర్నాథ్ యాదవ్ జై స్వరాజ్ పార్టీ ప్రారంభం రోజులో నుండి విస్తృతంగా ఎన్నో ఉద్యమ పోరాటాలు కొనసాగించే వారన్ని,ఇప్పటికే అనంతపురం జిల్లాలో అనేక గ్రామాల్లో జై స్వరాజ్ పార్టీ తరపున వ్యవసాయ కార్మిక పోరాటాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన కితాబిచ్చారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎంపికైన మేకల.అమర్నాథ్ యాదవ్ మాట్లాడుతూ తన పట్ల ఎంతో నమ్మకంతో జై స్వరాజ్ పార్టీ అనుబంధమైన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు కు మరియు పార్టీ రాష్ట్ర నాయకులకు,పార్టీ పలు విభాగాల శాఖల అధ్యక్షులకు,ప్రధాన కార్యదర్శులకు అమర్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. వీరందరూ తనకు అధిక సంఖ్యలో మద్దతు తెలపడం వల్ల తనకు రాష్ట్ర కన్వీనర్ గా ఎంపిక కావడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో జై స్వరాజ్ పార్టీ విస్తరణ కార్యక్రమాలు,సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపడతానని అమర్నాథ్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జై స్వరాజ్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ” ఆర్ ఎస్ కె థామస్ ” ,రాష్ట్ర కన్వీనర్ వారణాసి మురళీకృష్ణ,సీనియర్ నాయకులు జయచంద్రరావు,ప్రకాశం జిల్లా అధ్యక్షులు కంచర్ల నాగేశ్వరరావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

