అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి.

అంగన్వాడీలు వెంటనే సమ్మె విరమించాలి.

జనం న్యూస్ 21 సెప్టెంబర్ 2023 :---మహిళా,శిశు సంక్షేమ శాఖకు చెడ్డ పేరు తీసుకురావద్దు.సమాజంలో గర్భిణీలు, బాలింతలు,చిన్నారులు ఎక్కువమంది బలహీన వర్గాల వారే వారిని ఇబ్బందులకు గురి చేయొద్దు.అంగన్వాడీల, ఆయాల సేవలను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపీట.వాస్తవాలను గ్రహించి వెంటనే విధులకు హాజరు కావాలి.అంగన్వాడీలకు న్యాయం చేసింది, చేయబోయేది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే.కొందరు ఉద్దేపూర్వకంగా రాజకీయ లబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారు.అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచింది తెలంగాణ సర్కార్దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు అండగా నిలిచిందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.అంగన్‌వాడీ టీచర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే.రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ అంగన్‌వాడీలుగా మారుస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.ఇటీవలే సీఎం కేసీఆర్‌ అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్స్‌కు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ప్రకటించారు.65 ఏండ్ల వయసు దాటినవారికి సర్వీస్‌ బెనిఫిట్స్‌ కింద అంగన్‌వాడీ టీచర్లకు రూ.1 లక్ష, సహాయకులకు రూ.50 వేలు.పదవీ విరమణ అనంతరం అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులకు ఆసరా పెన్షన్‌.త్వరలో ఏర్పాటు కానున్న PRC లో సముచిత లబ్ధి జరుగుతుంది.అంగన్వాడి టీచర్లు హెల్పర్లు వెంటనే విధులోకి చేరండి, ఏవైనా సమస్యలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరాలు సాధించుకుందాం.(మంత్రి సత్యవతి రాథోడ్)దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్‌వాడీలకు అండగా నిలిచిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.  అంగన్వాడీల సమ్మెపై మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో చర్చించారు. కొన్ని యూనియన్లు ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించడంతో అంగన్వాడీలు సమ్మె బాట పట్టారని, వాస్తవాలను గ్రహించిన వెంటనే సమ్మె విరమించాలని  మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్  అంగన్వాడీలకు సేవలను గుర్తించి వారికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని అందుకు ఇటీవల విడుదల చేసిన జీవోలే ఉదాహరణలని మంత్రి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే దేశంలో ఎక్కడ లేని విధంగా అంగన్వాడీలకు అన్ని రకాలుగా ప్రాధాన్యతనిస్తూన్న విషయాన్ని మంత్రి మరోసారి గుర్తు చేశారు. అంగన్వాడీల సమ్మెతో సమాజంలో ఎక్కువగా ఉన్న బలహీనవర్గాల వారు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలకు,బాలింతలకు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే సమ్మె విరమించాలన్నారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సమ్మె బాటలో సమస్యలు పరిష్కారం కావని, వినతిపత్రం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్  పలు అంగన్వాడీలు ఇప్పటికే పలుమార్లు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్  దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అంగన్వాడీలకు అండగా నిలిచారని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచింది తెలంగాణ సర్కార్ అన్నారు. గత పాలకుల హయాంలో వేతనాలు పెంచాలని ఆందోళన చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. సీఎం కేసీఆర్‌ మూడు పర్యాయాలు వేతనాలను పెంచారని, ప్రస్తుతం మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లకు నెలకు రూ.13,650, మినీ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రూ.7,600 వరకు రాష్ట్ర సర్కార్‌ వేతనాలను పెంచిందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కనీసం అంగన్వాడీల ను ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు 11,500, కర్ణాటకలో 9500, కేరళలో 6500, మధ్యప్రదేశ్ లో 11500, మహారాష్ట్రలో 6500, గుజరాత్ లో 7800, రాజస్థాన్ 6230, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో 8250 మాత్రమే ఇస్తున్న విషయాన్ని గమనించాలన్నారు.అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు 50 సంవత్సరాలు లోపు వారికి రెండు లక్షల జీవిత బీమా 50 సంవత్సరాలు నుండి 65 సంవత్సరాల వరకు రెండు లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు మరణిస్తే మట్టి ఖర్చు నిమిత్తం టీచర్లకు 20,000 మరియు ఆయాలకు 10,000 అందిస్తున్నమని తెలియజేసారు.అంగన్వాడీల పని భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల వద్దకు అన్ని పోషకాహార వస్తువులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల యొక్క అద్దెను కూడా పెంచడం జరిగిందని గ్రామీణ ప్రాంతాల్లో 1000 నుండి 2000 పెంచామని,పట్టణాల్లో 4,000 నుండి 6 వేలకు, మెట్రోపాలిటన్ సిటీలో 6000 నుండి 8 వేలకు రాష్ట్ర ప్రభుత్వం అద్దెను చెల్లిస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్‌వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేది. మోదీ స‌ర్కారు ఆ వాటాను 60-40 శాతానికి మార్చింది. అదికూడా సరిగా అమలుచేయటం లేదు. రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాలి. కానీ, అంగన్‌వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, సహాయకుల వేతనాల్లో 17 శాతం మాత్రమే కేంద్రం ఇస్తున్నది. మిగతాదంతా రాష్ట్రప్రభుత్వమే భరిస్తున్నదని తెలిపారు.అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో 2014 లో  రాష్ట్రం ప్రభుత్వం వాటా 1500 ఉంటే, నేడు 10,950  పెంచిందని, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 30శాతం PRC కూడా వర్తింపజేస్తుందని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీల గౌరవ వేతనాలు ప్రతినెల 14 తారీకు వారి ఖాతాలో జమ చేస్తున్నామని అన్నారు. ఉద్యోగం విరమణ వయస్సు 65 సంవత్సరాలు చేస్తూ అంగన్వాడీ టీచర్స్ కు లక్ష రూపాయలు, మరియు ఆ ఆయాలకు 50 వేలు మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.రాష్ట్రంలోని 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 56 కోట్ల ఖర్చును భరిస్తుంది. అంగన్‌వాడీలను వర్కర్లు అనకుండా టీచర్లుగా మార్చి,  తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్రసేవల, రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తున్న వ్యవస్థను మరింత బలోపేతం చేయటంలో అంగన్‌వాడీ సిబ్బంది కృషిని సీఎం కేసీఆర్‌ గుర్తించి పెద్దపీట వేశారని మంత్రి స్పష్టం చేశారు. ఇలా అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తగిన గుర్తింపు ఇవ్వలేదని, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే అంగన్వాడీల సేవలు గుర్తించి మూడుసార్లు వేతనాలు పెంచిన విషయాన్ని మరోసారి మంత్రి గుర్తు చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరుకావాలని అంగన్వాడి సిబ్బందికి మంత్రి పిలుపునిచ్చారు.జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా