విజయ్ ఆంటోని ఇంటిలో విషాదం.

విజయ్ ఆంటోని ఇంటిలో విషాదం.

జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2023 :----హీరో విజయ్ ఆంటోనీ  కూతురు మాత్రమే కాదు.మనలాంటి ఇళ్లల్లో కూడా పిల్లలు డిప్రెషన్ కి గురవుతూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు.కారణాలు ఏవైనా కావొచ్చు కానీ మనం కనిపెంచిన పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకోవడం అంటే తల్లిదండ్రులకు ఎంత నరకమో తలచుకుంటేనే హృదయం ద్రవించిపోతుంది.అయినా మనం పిల్లలకు మంచి స్కూల్,బట్టలు,వస్తువులు,బొమ్మలు ,డబ్బులు ఇస్తే సరిపోతుంది,వాళ్ళు చక్కగా ఉంటారు అనే భ్రమలో ఉన్నాం.వీటన్నింటితో పాటు,వీటన్నింటికంటే విలువైన టైమ్ ని మనం తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వాలి.అప్పుడే వారి మానసిక స్థితి ఏంటి,వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి,వాళ్ళ భయాలు ఏంటి,సంతోషాలు ఏంటి అన్నది మనకు తెలుస్తుంది.పిల్లలు వారికొచ్చిన ప్రతి సమస్యనీ మన ముందు ఉంచగలిగేలా మనం వారితో ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పరుచుకుంటే,ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా పేరెంట్స్ ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది పిల్లలకు మనం రేయింబవళ్లు కష్టపడి పిల్లల కోసం తెగ సంపాదించేస్తున్నాం అని మురిసిపోతుంటాం కానీ రేపు ఆ పిల్లలే లేకపోతే ఏం చేసుకుంటాం ఆస్తులు, అంతస్తులు ❓అంత డబ్బు,పేరు,పలుకుబడి ఉన్న హీరో ఇంట్లో పరిస్థితే ఇలా ఉంటే ,మామూలు మనుషులం మన పరిస్థితి ఎలాంటిదో ఒకసారి ఆలోచించుకోవాలి మనం.వాళ్ళతో ,వీళ్ళతో కంపేర్ చేస్తూ,చదువంటే ఏదో యుద్ధం అయినట్టు ,ఖచ్చితంగా గెలిచే తీరాలి,ఫస్ట్ ర్యాంక్ మాత్రమే రావాలి అని మన ఫ్రస్ట్రేషన్ అంతా వారిపై రుద్దడం కాకుండా,వాళ్ళల్లో ఆహ్లాదకరమైన పోటీ తత్వం ఉండేలా చూసుకోవాలి.అదిచదువైనా,జీవితమైనా,మరేదైనా కావొచ్చు ❗అసలు మన ఎడ్యుకేషన్ సిష్టమే సరిగా లేదు.పోటీ ప్రపంచంలో పిల్లలకి విలువలు నేర్పించడం మానేసి,మార్కుల కోసం చదివే మెషీన్లలా తయారు చేస్తున్నాం.ఎంత మంచి మార్కులు వచ్చినా కూడా ఇంకా ఏదో అసంతృప్తి నిండిపోతుంది పిల్లల్లో .ఏదో తెలియని వెలితి ❗ దాంతో తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు.ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో అర్థంకావడం లేదు.ఈ పోటీ ప్రపంచంలో పిల్లలకు అమ్మా నాన్న తప్ప మన రిలేటివ్స్ ఎవరు ❓బంధాలు ఏంటి ❓ బంధుత్వాలు ఏంటి ❓అనేవి కనీస అవగాహన కూడా లేకుండా అయిపోతుంది.విచారించదగ్గ విషయం ఇది.నూటికి నూరుపాళ్లూ తల్లిదండ్రుల పొరపాటు వల్లే ఇది జరుగుతుంది.మనము పిల్లలకు సంపాయించి పెడుతున్నాము , వాళ్ళకోసమే కదా అని కష్టపడుతున్నాము , కానీ ఆ పిల్లలకు మన  టైమ్.ఇవ్వలేకపోతున్నాము , మనం పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపకపోవడమే అన్ని సమస్యలకు కారణం.దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించండి