అంతరాష్ట్ర ఆటో దొంగల ముఠాను అరెస్టు చేసిన గద్వాల్ పోలీసులు.

అంతరాష్ట్ర ఆటో దొంగల ముఠాను అరెస్టు చేసిన గద్వాల్ పోలీసులు.

జనం న్యూస్ 30 సెప్టెంబర్ జోగులాంబ గద్వాల్ జిల్లా నిందితుల  నుండి 12 ఆటో లు స్వాధీనం.విశ్వసనీయ సమాచారం మేరకు తేదీ 29.09.2023 సాయంత్రం నాలుగు గంటల సమయంలో గద్వాల్ దగ్గర అయిజ రింగ్ రోడ్డు వద్ద  గద్వాల టౌన్ పోలీస్ లు, సీసీ ఎస్ పోలీస్ లు కలసి ఆటో లు దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళుతుండగా  పట్టుకొని వారి దగ్గర నుండి 12 ఆటో లను స్వాధీనం చేసుకోవడ మైనది. కేసు వివరాలు:          తేది 02.09.2023 నాడు రాత్రి గద్వాల పట్టణo సుంకులమ్మ మెట్టు కాలనీకి చెందిన పకృద్దిన్ s/o అబ్దుల్ జలిల్ వయసు - 32 సం "లు, వృత్తి - ఆటో డ్రైవర్ అను వ్యక్తి తన ఇంటి ముందు ఆటో నిలుపుకొని ఇంట్లో నిద్రించి  ఉదయము లేచి చూడగా ఇంటి ముందు తన ఆటో కనిపించక పోవడం తో గద్వాల్ పట్టణం లో వేతికిన దొరకక పోవడం తో తేది 04.09.2023 నాడు గద్వాల్ పట్టణములో పిర్యాదు ఇవ్వగా గద్వాల్ పట్టణ పోలీసులు క్రైమ్ నెం 198/2023 u/s 379 IPC గద్వాల టౌన్ PS లో కేసు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసును ఛేదించేందుకు  జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన గారి ఆదేశాల మేరకు సి సి ఎస్ ఇన్స్పెక్టర్           M. భగవంత్ రెడ్డి అధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి చేదించడం జరిగింది.1.ముద్దాయిల వివరాలు:A1. సయ్యద్ సమీర్ @ నవాజ్ s/o ఖలీల్ ఉర్ రహమాన్ వయస్సు: 34 సం. రాలు, కులం: ముస్లిం, వృత్తి: DCM డ్రైవరు నివాసం: నవాజ్ సాబ్ కుంట, సంజయ్ గాంధీ నగర్, రిజ్వాన హోటల్ వెనుక, ఫలకనామా, చార్మినార్, హైదరాబాద్,  A2. మహమ్మద్ అలీం s/o మహమ్మద్ సలీం వయస్సు: 27 సం. రాలు, కులం: ముస్లిం, వృత్తి: ఆటో డ్రైవరు నివాసం. నవాజ్ సాబ్ కుంట, సంజయ్ గాంధీ నగర్, రిజ్వాన హోటల్ వెనుక, ఫలకనామా, చార్మినార్, హైదరాబాద్.  2. గతం లో నమోదు అయిన కేసుల వివరాలు1. నిందితుడు సయ్యద్ సమీర్ మరియు మహమ్మద్ అలీం గత సంవత్సరం కర్నూల్ టౌన్ నందు ఆటో లను దొంగతనం చేస్తూ పట్టుబడగా ఇద్దరినీ అరెస్ట్ చేసి జైల్ కు పంపినారు.  2. నిందితుడు మహమ్మద్ అలీం మార్చి -2023 సంవత్సరం లో సూర్యాపేట మరియు కొత్తకోట పోలీస్ స్టేషన్ ల పరిది లో ఆటో లను దొంగతనం చేయగా,  సూర్యాపేట పోలీస్ వారు అలీం ను అరెస్ట్ చేసి జైల్ కు పంపినారు.  3.నేరము చేసే/చేసిన విధానము:నిందితుడు అయిన సయ్యద్ సమీర్ భార్య తమ్ముడు అయిన మహమ్మద్ సలీం లు మంచి స్నేహితులు, ఇద్దరు జల్సాలకు అలవాటు పడి మద్యం త్రాగడం, జూదం ఆడటం అలవాటు కలదు, ఇద్దరు పనీపాటా చేయకుండా జల్సాలకు అలవాటు పడి, వారి దగ్గర డబ్బులు లేనందున వారి అవసరాలు తీర్చుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవించేవారు, వీరు ఇంటిముందు రోడ్డు ప్రక్కల ఉన్న ఆటో లను వారి దగ్గర ఉన్న తాళలను ఉపయోగించి దొంగతనం చేసి వాటికి ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ లను తొలగించి, దొంగతనం చేసిన ఏరియా లో కాకుండా ఇతర ప్రాంతాలలో అమ్మి వచ్చిన  అవసరాలు తీర్చుకునేవారు.   *4.స్వాదిన పరచుకున్న ఆటో5.నేరము ను చేదించిన విధానము:నిందితులు ఇద్దరు గద్వాల లలో దొంగతనం చేసిన ఆటో ను రాయచూర్ రైల్వే స్టేషన్ పరిసరాలలో  తిరుగుతూ ఆటో ను అమ్మేందుకు ప్రయత్నించగా వాటికి సరైన పత్రాలు లేకపోవడం వల్ల  ఎవరు కొనకపోవడం వల్ల  తిరిగి ఇట్టి ఆటో ను జడ్చర్ల కు తీసుకువెళ్దామని అనుకోని ఆటో ను   నడుపు కుంటూ రాయచూర్ నుండి జడ్చర్ల కు గద్వాల మీదుగా వెళ్దామని గద్వాల పట్టణం బయట ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పై జమ్మిచెడు వైపు నిన్న సాయంత్రము వెళ్ళు చుండగా  అందాజ 04:00  గంటల సమయం లో అయిజ రింగ్ రోడ్డు దగ్గర గద్వాల టౌన్ పోలీస్ లు, సీసీ ఎస్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఆటో కు నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ఆటో ను అపి విచారించగా వారి దగ్గర ఎలాంటి కాగితాలు లేనందున తపించుకునెందుకు ప్రయత్నించడం  తో  పోలీస్ వారు వెంబడించి వారిని  పట్టుకొని తగిన రీతిలో విచారించగా గతంలో వారు దొంగలించిన ఆటో లు విషయం బయటకు రావడంతో అట్టి ఆటోలను స్వాధీనం చేసుకోవడం జరిగినది. ( వాటిలో 5  ఆటో లు  పెబ్బేరు లారీ ట్రాన్స్ పోర్ట్ ప్రక్కల మరియు 6 ఆటో లు జడ్చర్ల లోని మన్సూర్ డాబా వెనుక )     జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన గారి  ఆదేశాల మేరకు, అదనపు  ఎస్పీ శ్రీ ఎన్.రవి గారి సూచనలతో డి.ఎస్పీ శ్రీ పి . వేంకటేశ్వర్లు   స్వియ పర్యవేక్షణలో గద్వాల్ సి.ఐ శ్రీనివాసులు, సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి అధ్వర్యంలో పట్టణ ఎస్సైలు  శ్రీకాంత్,  IT కోర్ ఎస్సై రజిత,  అందరూ కలిసి సాoకేతిక పరిజ్ఞానము తో ఇట్టి కేసు ను చేదించడం  జరిగింది. ప్రెస్ మీట్ అనంతరం నిందితులను కోర్టు లో హాజరుపరచి రిమండ్ కు తరలించడం జరుగుతోంది.ఈ కేసును చెదించడం లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ భగవంత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ రంజిత్, శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ ప్రసాద్, భరత్, సీసీ కెమెరా సిబ్బంది చంద్రయ్య, రామకృష్ణ, రమేష్ చారి లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా క్యాష్ రివార్డ్ తో అభినందించడం జరిగింది.PROజిల్లా పోలీస్ కార్యాలయంజోగుళాంబ గద్వాల్ జిల్లాజనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా