ఆర్టీసీ డ్రైవర్ లకు రహదారి భద్రత పై అవగాహన సదస్సు

ఆర్టీసీ డ్రైవర్ లకు రహదారి భద్రత పై అవగాహన సదస్సు

జనం న్యూస్,జనవరి 25 విజయనగరంనేడు స్థానిక జిల్లా కోర్ట్ దగ్గర ఉన్న ఆర్టీసీ వర్క్ షాప్ జోనల్ స్టాఫ్ ట్రైన్ కాలేజీలో  ఏపీఎస్ఆర్టీసీ జోనల్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్సి.రవి కుమార్ రోడ్డు  భద్రత వారోత్సవాలను, ప్రారంభించారు. ముందుగా డ్రైవర్ అందరికీ డ్రైవర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ ఉద్దేశించి, మాట్లాడుతూ బస్సు కండీషన్, డ్రైవింగ్‌ చేసే సమయంలో ఏకాగ్రత ఉండాలని ,ప్రయాణికులతో ఎలా ఉండాలనే దానిపై నిపుణులతో ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేశామని, తెలిపారు. పాసింజర్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా  సర్వీస్ చేయాలనీ ఆక్సిడెంట్స్ తగ్గించి, ఇందనం ఆదా చేయాలి.వాహనాల నిర్వహణ పై అవగాహన, ఎప్పటి కప్పుడు మరమ్మత్తు చర్యల ద్వారా  జరుగుతున్న ప్రమాదాలు మరియు మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యం అవుతుందని అన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తు ట్రాఫిక్ నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండి వాటిని కచ్చితంగా పాటించాలన్నారు.  ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ చోఫ్ ట్రాఫిక్ మేనేజర్  బి. అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.