ఆలేరు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు జాడ లేదు కొత్త హమిలా; గ్యార నరేష్

ఆలేరు ఎమ్మెల్యే  ఇచ్చిన హామీలు జాడ లేదు కొత్త హమిలా; గ్యార నరేష్

జనం న్యూస్ 17అక్టోబర్ ఆలేరు యదద్రి (మండల రిపోర్టర్ జహంగీర్) ఆలేరు మండలం మంతపురి గ్రామం లో YSR తెలంగాణ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గ్యార నరేష్ విలేకరులతో మాట్లాడుతూ 2014 మరియు 2019 ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు ఏమైనాయి అని ప్రశ్నించారు అంతే కాకుండా ఈ ఎన్నికల్లో మరిన్ని కొత్త హామీలతో గ్రామాలలోకి వస్తున్నారు గతం లో మీరు ఇచ్చిన హామీలు ఎంత మంది ప్రజలకు అందించారో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్డి,పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. బి ఆర్ ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమిత మైందిఅని అమలు చేయడం లో పూర్తిగా విఫలమైంది అని.ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు ప్రజల మనిషి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని కోరుకున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి మళ్ళీ తెలంగాణాలో రాజన్న సంక్షేమ పాలన వై ఎస్ షర్మిలమ్మ తోనే సాధ్యం అందుకే ఆలేరు నియోజకవర్గ ప్రజలు వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ ని ఆదరించాలని అన్నారు 

ఈ కార్యక్రమం లో కొంపల్లి సందీప్, రగాళ్ళ విజయ్, ఎర్ర శేఖర్, సంతోష కుమార్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు