ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, వి గాట్400 సీట్స్ బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

ఫిర్ ఏక్ బార్  మోడీ సర్కార్, వి  గాట్400 సీట్స్  బిజెపి మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

జనం న్యూస్ 2024 ఏప్రిల్ 5 మెదక్ (జిల్లా బ్యూరో) : 


 కాంగ్రెస్  పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తూ మెదక్ రాందాస్ చౌరస్తాలో బిజెపి కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో సత్య గ్రహదీక్ష నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిర్వహించిన ఈ సత్యాగ్రహ దీక్షా శిబిరంలోబిజెపి రాష్ట్ర కార్యదర్శి, మెదక్ ఎంపీ కాండేట్,  దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎంపి అభ్యర్థి రఘు నందన్ రావు మాట్లాడుతూ ఎద్దు ఏడ్చిన వ్యవసాయం,  రైతు ఏడ్చిన  రాజ్యం  బాగుపడదు అని అన్నారు.
 నేడు కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల  రైతులకు కష్టం-నష్టం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీనిగద్దె దించేటప్పుడు మేము అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. వరికి ఎకరానికి  500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటికి ఇవ్వలేదు. ఎన్నికలకు కోడ్ వచ్చిందనే నెపం తో మనుసు లేని  నాయకుడు సీఎం రేవంత్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నోట్లు, ఓట్లు, సీట్లు, అధికారం తప్ప,   బువ్వ పెట్టే రైతన్నకి ఏం చేయాలనే విషయం పట్ల కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదన్నారు. రాహుల్ గాంధీ నీ తీసుకొచ్చి తుక్కుగూడలో మీటింగ్ పెడతారట. తుక్కుగూడలో మీటింగ్ పెడితే
తుక్కు. తుక్కుగా తొక్కి ఢిల్లీకి పంపిస్తామని అన్నారు. నీ మాయమాటలు నమ్మి మిమ్మల్ని అధికారంలోకి తెస్తే రైతులు అనేక పడుతున్నారు.
రైతు భరోసా కింద 15 వేల రూపాయలు రైతులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. 
గత ప్రభుత్వం తప్పు చేశారని  గద్దె దించి  మిమ్మల్ని అధికారంలోకి తెస్తే మీరు అదే బాటలో నడుస్తున్నారని అన్నారు.కూడవెల్లి వాగు ఎండిపోతుంది. మల్లన్న సాగర్ లో ఉన్న నీళ్ల ను
కూడవెల్లి వాగుకు నీళ్లు ఇవ్వండని అడిగితే.. నీల్లు ఇవ్వడానికి మనసు రావడం లేదు. కౌలు రైతుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పారు.
 బి ఆర్ ఎస్ ప్రభుత్వం కౌలు రైతులను  పట్టించుకోలేదని చెప్పింది కాంగ్రెస్. మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు 12,000 పంటకి ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. నష్టపోయిన వరి రైతులకు 25 వేల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేశాడు. కాంగ్రెస్ అంటేనే మోసం. మాట ఇయడం, మాట తప్పడం కాంగ్రెస్ కొత్తేమీ కాదు. 2001 నుంచి 2004 వరకు కరీంనగర్ సభలో సోనియాగాంధీ మమ్మల్ని గెలిపించి ఢిల్లీ పంపండి తెలంగాణ ఇస్తామన్నారు.. 2004 నుంచి 2014  వరకు తెలంగాణ ఉద్యమం కోసం 1400  వందల మందిని చంపిన ఘనత చంపిన ఘనత కాంగ్రెస్ పార్టీది .
కాంగ్రెస్ పార్టీ  పాలన నాలుగు నెలలో అందరికీ అర్థమయింది . 2018 డిసెంబర్ రెండోసారి కేసీఆర్ గెలిచిన తర్వాత సారు, కారు, 16 ఢిల్లీలో సర్కార్ అన్నాడు. చివరికి ఏమైంది. ఈ దేశానికి మూడోసారి ప్రధాని మోడీ అని అన్ని మాధ్యమాలు చెబుతున్నాయి. వచ్చేది నరేంద్ర మోడీ సర్కార్.
దేశ రైతులను కాపాడే కూడా మోడీ సర్కారే. బి ఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కలెక్టర్ కుర్చీలో కూర్చొని రైతులను డీలర్లను పిలిచి వరి ఏస్తే ఉరి అన్నాడు. రైతుకు ఉరివేస్తా అన్న వెంకట్రామిరెడ్డికి. ఇప్పుడు ఉరివేయాలి.
కలెక్టర్గా ఉన్నప్పుడే
విత్తనాల అమ్మితే ఉరి అన్నాడు. కాలు మొక్కి ఎమ్మెల్సీ గ గెలిచాడు వెంకటరామిరెడ్డి. ఎమ్మెల్యేల కోట కింద వెంకట రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఫ్రీగా వచ్చింది. మనసున్న వ్యక్తి అయితే 100 కోట్లు ఖర్చు పెట్టకుండా ఎవరు ఆపారు.  మెదక్ లో జై తెలంగాణ అన్న వారు ఎవరు లేరా. రాందాస్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమ సమయంలో వంటావార్పు చేసిన ఉద్యమకారులు లేరా వారికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా.. వేరే వ్యక్తికి ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్నించారు.
పైసలు తీసుకొని పువ్వు గుర్తుకు ఓటెసి గెలిపించాలి.
ఈ ఎన్నికలు దేశం కోసం. మోడీ కోసం జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఎంపీ ఎలక్షన్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారి మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంకా ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ, యువమోర్చ అధ్యక్షులు మాందాపురం సతీష్ పటేల్, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, బిజెపి కాంసెన్సీ ఇంచార్జి ఎక్కల్దేవ్ మధు, జిల్లా కార్యదర్శులు ఎం ఎల్ ఎన్ రెడ్డి,  రాష్ట్ర కమిటీ సభ్యురాలు కరణం పరిణిత, పంజా విజయ్ కుమార్, మురళీధర్ యాదవ్, సుభాష్ చంద్ర గౌడ్, కౌడిపల్లి, కొల్చారం, చిలిపి చెడు, మెదక్, హవేలీ ఘనపురం ,  నిజాంపేట, రామయంపేట, చిన్న శంకరం పేట, నార్సింగ్, చేగుంట, మండల అధ్యక్షులు మాట్లాడారు. ఈ సత్యాగ్రహ దీక్షకు వేలాది మంది రైతులు తరలివచ్చారు.