ఐలాపూర్ గ్రామంలో స్వామివివేకానంద 160 వ జయంతివేడుకలు

ఐలాపూర్ గ్రామంలో స్వామివివేకానంద 160 వ జయంతివేడుకలు

 జనం న్యూస్ కోరుట్ల జనవరి 13 రిపోర్టార్ గిన్నెలశ్రీకాంత్

కోరుట్ల మండలం లోని ఐలాపూర్ గ్రామం లో స్వామి వివేకానంద 160 వ జయంతి వేడుకలు గ్రామ యువజన సంఘాల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివేకానంద బోధనలు చదవాలని, వారి దారిలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిడుగు సందయ్య ,అల్లికోరి గోపి,వెంకటరెడ్డి రాజు, జేమ్ సురేష్, ,రాజోజి గోపి, నరేందర్, తిరుపతి, రాణవేని సురేష్,యువజన సంఘాల సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.