ఓంకారం లో కన్నుల పండుగగా సాగిన రథోత్సవం.

ఓంకారం లో కన్నుల పండుగగా సాగిన రథోత్సవం.

జనం న్యూస్ 10మార్చి 2024 బండి ఆత్మకూరు మండలం, శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా: మండలంలోని ఓంకారం పుణ్యక్షేత్రంలో కన్నుల పండుగగా సాగిన రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి  బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రథాన్ని పచ్చటి తోరణాలు పుష్పాలతో శోభాయామనంగా అలంకరించి రథంపై దేవతామూర్తుల ఉత్సవా విగ్రహాలు ఉంచి  భక్తులు తాళ్లతో  రథాన్ని లాగి మొక్కలు తీర్చుకున్నారు. అనంతరం అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.