విద్యుదాఘాతానికి గురైన పెయింటర్ షెక్షా వలికి పెండ్యాల శ్రీలత పరామర్శ...

విద్యుదాఘాతానికి గురైన పెయింటర్ షెక్షా వలికి పెండ్యాల శ్రీలత పరామర్శ...
  • విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే షెక్షా వలికి ప్రమాదం -  - రూ. 5  వేలు ఆర్థికసాయం... పార్టీ అండగా ఉంటుందని బరోసా..
  • జనం న్యూస్ మార్చి 5 జిల్లా బ్యూరో....విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పెయింటర్ షెక్షా వలి విధ్యుతాఘాతానికి గురికావాల్సి వచ్చిందని జనసేణ పార్టీ రాయలసీమ మహిళా విభాగం కో - ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఆరోపించారు. విధ్యుతాఘాతానికి గురైన షెక్షా వలినీ మంగళవారం పెండ్యాల శ్రీలత ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు కొట్టలలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తనవంతు సాయంగా రూ. 5 వేలు ఆర్థికసాయం అందించి ధైర్యంగా ఉండాలని బరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ప్రజాశక్తి నగర్, బీజేపీ కొట్టాలలో విద్యుత్ సమస్య ఉందని కాలనీవాసులు విద్యుత్ శాఖ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. కాలనీలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎర్తింగ్ పైపు తొలగించడంతో కాలనీలోని ఇళ్లకు, గోడలకు కరెంటు సరఫరా అయి కరెంట్ షాక్ తగిలిందన్నారు. అదే సమయంలోనే కాలనీలో పెయింటింగ్ పని చేస్తున్న షెక్షా వలికి కరెంట్ షాక్ తగిలి గాయలపాలయారాన్నరు. ఈ సమస్య గురించి కాలనీవాసులు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు కాలనీలో పర్యటించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని సూచించారు...