కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం ఎండిందా.

కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం ఎండిందా.

*6 గ్యారంటీలు ఏమాయే..

*మళ్లీ కేసీఆర్ కు అండగా నిలవాలి

*మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేద్దాం
కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటాం
*పనిమంతుడు వెంకట్రామరెడ్డి కి అండగా నిలవాలి

*మాజీ మంత్రివర్యులు, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

 జనం న్యూస్ ఏప్రిల్ 12

వెల్దుర్ధి; మెదక్ గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి వర్యులు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునితా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.. వెల్దుర్ధి లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో జరిగిన వెల్దుర్ధి, మాసాయిపేట మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి తో కలిసి మాట్లాడారు..6 గ్యారంటీలతో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం డోఖా చేసిందన్నారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఎకరం పొలం ఎండిపోలేదని, నేడు 20 లక్షల ఎకరాల్లో పంట ఎండిందన్నారు...కళ్యాణ లక్ష్మి లో తులం బంగారం పక్కన పెడితే లక్ష కూడా రావడం లేదన్నారు..కరెంటు బిల్లు కూడా కట్టాలని, జీరో బిల్లు లేదంటున్నారన్నారు..మహాలక్ష్మి పథకం లో 2500 హుష్కాకీ అయిందన్నారు..రాష్ట్రంలో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు జాతీయ మెనిఫెస్టో అని వస్తున్నారని ప్రజలు గమనించాలన్నారు..మాయమాటల రఘునందన్ కు దుబ్బాకలో ప్రజలు చిత్తుగా ఓడించారని, ఎంపీ ఎన్నికల్లో కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు..
డ్వామా పీడీగా, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచాడన్నారు..కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి తెలియకుండా చేసిన మనసున్న మహా మనిషి వెంకట్రామరెడ్డి అన్నారు..
మొన్న ఎన్నికల్లో ఉమ్మడి వెల్దుర్ధి మండలంలో పార్టీ శ్రేణులు అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు..ఏ కష్టం వొచ్చినా కార్యకర్తలకు అండగా ఉంటామని, ఏ కష్టం వొచ్చినా కంటికి రెప్పలా కాపాడు కుంటామన్నారు..

*పోచమ్మ సాక్షిగా .ట్రస్టు ఏర్పాటు చేస్తా

*కేసీఆర్ కి వెన్నంటి నిలవాలి

*పి వెంకట్రామరెడ్డి ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ

వెల్దుర్తి లోని నెల్లూరు పోచమ్మ సాక్షిగా చెబుతున్నా..అబద్దాలు ఆడేవాన్ని కాదు, గెలిచిన 30 రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి ఆదుకుంటానని ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి హామీ ఇచ్చారు..కలెక్టర్ గా ఖ్యాతి అందించిన మెదక్ ఉమ్మడి జల్లా ప్రజలు, ఎంపీ గా ఘన విజయం అందించాలని ఆయన కోరారు...కేసీఆర్ లేకుంటే తెలంగాణ వొచ్చేనా, మనకు గోదావరి నీళ్లు వొచ్చేనా, 24 గంటల కరెంటు అందేనా అని ఆయన ప్రశ్నించారు..
నేను గ్రూప్1 లో ర్యాంక్ సాధించినప్పుడు మా అమ్మ ఒక్కటే చెప్పింది.. ఉద్యోగం అంటే హక్కు కాదు, బాధ్యతగా పనిచేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.... అదే బాధ్యత తో పనిచేయడంతోనే ఎక్కువ మంది ముఖ్యమంత్రుల వద్ద పని చేసే అవకాశం వొచ్చిందన్నారు..తనువు చాలించిన తర్వాత కూడా నా పేరు ఉండాలనే ఆలోచన తోనే కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ట్రస్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పీవీఆర్ ట్రస్టు ద్వారా బీఆర్ ఎస్ కార్యకర్తల, నిరుపేదల కుటుంబాల విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత కోచింగ్, వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు జాబ్ మేళా ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.. మహిళలకు సైతం కుట్టు శిక్షణ, స్వయం ఉపాధి శిక్షణ అందిస్తామన్నారు..
ఉద్యమ నాయకులు తోట నర్సింలు ఆవేదన అర్థం చేసుకున్నానని, ఉద్యమ కారులకు అండగా ఉంటామన్నారు..ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కుటుంబాలకు శుభ కార్యాలకు కేవలం ఒక్క రూపాయితో  అందిస్తామన్నారు..విద్యావేత్తగా, మేజిస్ట్రేట్ గా , కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి గా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదన్నారు..మెదక్ గడ్డ గులాబీ అడ్డ అని, కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.. నియోజకవర్గంలోని
గుమ్మడిదల, మెదక్ తదితర సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చుకుందామన్నారు..