కోడి పందాలు గుండాటలపై నిషేధం

కోడి పందాలు గుండాటలపై నిషేధం

 జనం న్యూస్ జనవరి 12 కా ట్రేను కోన

కోడిపందాలు గుండాట్లు నిషేధం

కాట్రేనికోన మండల పరిధిలోని సంక్రాంతి సందర్భంగా గుండాట. పేకాట. కోడిపందాలు. అశ్లీలనుత్యాల వైపు వెళ్లకుండా, సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా , కాట్రేనికోన మండల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, నాగేశ్వరరావు గురువారం తెలిపారు. ఎవరైనా కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోడి పందాలు నివారించేందుకు తాసిల్దార్ పశుసంవర్ధక శాఖ అధికారి. సామాజిక కార్యకర్తతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని. పందాలు వల్ల కలిగే అనర్థాలను కమిటీ ద్వారా ప్రజలకు తెలియజేయుట జరుగుతుందని ఎస్సై తెలిపారు. కోడి పందాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి. పందాల నిర్వాహకుల వారికి నోటీసులు అందజేసి. తగు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మండల ప్రజానీకానికి తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు..