ఏపీఐఐసీ స్థలంలో బూడిద నిల్వ అక్రమ మట్టి తవ్వకాలు జరిపిన వారి పై చర్యలు తీసుకోవాలి*

ఏపీఐఐసీ స్థలంలో బూడిద నిల్వ అక్రమ మట్టి తవ్వకాలు జరిపిన వారి పై చర్యలు తీసుకోవాలి*

అచ్యుతాపురం(జనం న్యూస్):అచ్యుతాపురం సెజ్ రాంబిల్లి మండలం పూడి గ్రామం ఈటిపి ప్లాంట్ పక్కన ఉన్న ఏపీఐఐసీకి సంబంధించిన ప్రభుత్వ స్థలాలో పెదపూడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అచ్యుతాపురం సెజ్ పరిశ్రమలో ఉన్న లారస్,డాల్ కోట్,యొకమా తదితర కంపెనీల నుండి వస్తున్న బూడిదను ఏపీఐఐసీ

స్థలంలో ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచి

బూడిదతో పాటు అక్రమంగా మట్టిని త్రవ్వి కంపెనీలు,ఇంటి నిర్మాణలకు ఇటుకలు తయారీకి ఉపయోగిస్తున్నారని రసాయన వ్యర్థాలు ఎక్కువగా ఉన్న పౌడర్ ను భూమిలోకి గొయ్యి తీసి డంపింగ్ చేస్తున్న జేసీబీ మరియు లారీని సీజ్ చేసి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న వారి పై ఏపీఐఐసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక యువకులు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో రాజాన సంజీవ్,సురేష్,చిరంజీవి,రాజేష్,కార్తీక్,కాసు,నరేందర్,నరసింహా, హేమంత్,రంజిత్, హరీష్,గంగాధర్,హరీష్,కిషోర్, శివాజీ, రాజు,శ్రీను, కాసుబాబు తదితరులు పాల్గొన్నారు