గ్రామ దేవత గ్రామ సందర్శన.

గ్రామ దేవత గ్రామ సందర్శన.

జనం న్యూస్ మే 4 కాట్రేను కొన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవాలు సందర్భంగా ఈ రోజున సాయంత్రం నాలుగు గంటలు ఐదు నిమిషాలకు అమ్మవారి గరగ పుజా మహోత్సవాన్ని ముందుగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయంలో గరగలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
అనంతరం భక్త శ్రీ తాతపూడి సుబ్రహ్మణ్యం (బుజ్జి)గారు, మరియు భక్త శ్రీ సుంకర పవిత్ర కుమార్ గారు చేతుల మీదుగా ఆలయ ప్రధాన ఆశాధులు మందపల్లి మహేష్ మరియు వారి కుమారులైన మందపల్లి సూర్య దుర్గాప్రసాద్, మందపల్లి నాగ వీరభద్రరావు గారికి గరగలను వారి శిరస్సు మీదపెట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ చైర్మన్ ఆణివీళ్ళ సాయిబాబా గారు, రామకృష్ణ పరమహంస (కిష్టయ్య) గారు, ఆలయ ప్రధాన పురోహితులు  ఫణికాంత్ శాస్త్రి, ఆ కొండి శ్రీకాంత్, ఆకొండి శ్రీరామచంద్రమూర్తి, ఆణి వి ళ్ళ శేష సాయి గారు, ఆకొండి కాశీ విశ్వనాథం గారు, గ్రంధి రాంప్రసాద్, యల్లమెల్లి కృష్ణ, చిక్కాల నాగేశ్వరరావు, సాన బోయిన సూరిబాబు గారు, విత్తనాల నరసింహారావు గారు, తాతపూడి రాంబాబు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాన్ని తిలకించి గ్రామ దేవత గ్రామ సందర్శన కార్యక్రమాన్ని జయప్రదం చేసిరి.
ఈనెల 14వ తారీకు నుండి 20వ తారీకు వరకు అమ్మవారి జాతర కార్యక్రమాలు దేవస్థానం నందు నిర్వహించబడును.
ఈనెల 21వ తారీకు శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవ కార్యక్రమం జరుగును.
శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం, కాట్రేనికోన