చేర్యాలకు సురేందర్ రావు సేవలు చిరస్మరణీయం

చేర్యాలకు సురేందర్ రావు సేవలు చిరస్మరణీయం

 సబ్ టైటిల్* సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్

*సురేందర్ రావు మృతి పట్ల సీపీఐ చేర్యాల మండల కమిటీ నివాళులు

 జనం న్యూస్ జనవరి 23 ( సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి విజయ్ కుమార్ )

 సిద్దిపేట్ జిల్లా చేర్యాల చేర్యాలకు సురేందర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయమని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. సోమవారం రాత్రి చేర్యాల పట్టణానికి చెందిన భూదాత కల్వకోట సురేందర్ రావు (80) అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతి పట్ల సీపీఐ నాయకులు ఆయన పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. సురేందర్ రావు దొర చేర్యాల పట్టణంలో వందల ఎకరాలు ప్రభుత్వానికి పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చి భూ దానకర్తగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. చేర్యాల బస్టాండ్, వ్యవసాయ మార్కెట్ యార్డు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు స్థలాన్ని ఇచ్చి భూమి దానం చేసి గొప్ప మనసు చాటుకున్న వ్యక్తి సురేందర్ రావు అని ఆయన సేవలను కొనియాడారు. నివాళులర్పించిన సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సిపిఐ డివిజన్ కమిటీ సభ్యులు జంగిలి యాదగిరి, నంగి కనకయ్య, తిగుల్ల కనకయ్య, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ లు ఉన్నారు.