జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్

జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్

జనం న్యూస్ 09 ఏప్రిల్ 2024 సెక్రటరీ, ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి శృతి ఓజా అధికారులను ఆదేశించారు.

    సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీఓ లతో నీటి సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని విధాలుగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.  మిషన్ భగీరథ ద్వారా అన్ని జనవాసాలకు ప్రతిరోజు త్రాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బోరు మోటర్లు, ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు.  మండల స్థాయి అధికారులు అందరూ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సంప్రదిస్తూ నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.  ఎక్కడైనా  తాగునీటి సమస్య ఉన్నట్లు పత్రికలలో వార్తలు వస్తే అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నీటి లభ్యత, తాగునీటి డిమాండ్, సప్లై  తదితర వివరాలను మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. పైప్ లైన్ లీకేజీలు ఎక్కడ ఉండొద్దని, ప్రభుత్వ బోర్లు, చేతి పంపులు అన్ని మరమ్మతులు చేయించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు .
మంచి నీటి ఓవర్ హెడ్ ట్యాంకుల పై సరైన మూతలు ఉండే విధంగా నీటి కాలుష్యం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని బోర్లు మరమ్మతులు చేయించారు వాటి ప్రస్తుత స్థితిగతులు ఎంటి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ, మిషన్ భగీరథ బల్క్ వాటర్ సప్లై కు ఎలాంటి సమస్య లేదని, జిల్లాలోని   4 మున్సిపాలిటీలు, 255 గ్రామ పంచాయతీలకు అవసరం మేరకు నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. మండల స్థాయి నుండి గ్రామ స్థాయి, మున్సిపాలిటీలలో ఎంపీఓ లు,
ఏఈ లు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ కార్యదర్శులు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.  ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే స్పందిస్తూ జిపి నిధులతో బోరు మోటార్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

      సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, మిషన్ భగీరథ ఎస్.ఈ జగన్ మోహన్, ఇంట్రా, గ్రిడ్ ఈఈ లు శ్రీధర్ రెడ్డి, భీమేశ్వరరావు, డి ఆర్ డి ఓ  నర్సింగరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకట్ రెడ్డి, మిషన్ భగీరథ డిఈ లు, ఏఈ లు, ఎంపిఓ లు, మున్సిపల్ కమిషనర్లు  తదితరులు పాల్గొన్నారు.
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా