నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా అభివృద్ధి కనబడలేదు

జనం న్యూస్. ఏప్రిల్ 9. సంగారెడ్డి జిల్లా. హత్నూర మండలం. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)


పార్లమెంటు ఎన్నికల్లో  కొద్దిగా ఆలోచన చేసి ఓటెయ్యాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు సోమవారంనాడు నర్సాపూర్ పట్టణంలోని కంజర్ల శంకర్ యాదవ్ ఫంక్షన్ హాల్ లో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు సమావేశాన్ని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడానికి ప్రజలను హామీల పేరిట బుట్టలో వేసుకున్నారన్నారు  రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదన్నారు రెండు లక్షల రుణమాపి అయిన వాళ్ళు కాంగ్రెస్‌కు ఓటెయాలని మాఫీ కాని వాళ్లు కారు గుర్తుకు ఓటెయ్యాలన్నారు రూ.2500కు ధాన్యాన్ని కొనకపోతే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే వలసల మీద దృష్టి పెట్టాడు రేవంత్ రెడ్డి అంటూ విమర్శించారు పంటకోతకు వచ్చిన ఇప్పటికి రైతుబంధు పడలేని పరిస్థితిలో ఉన్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పాలనలో పల్లెలు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందాయని మంజీరా నది చెక్ డ్యామ్ నిర్మించుకున్నామని ఈరోజున బ్రహ్మాండమైన నీటి సౌకర్యం కల్పించింది కేసీఆర్ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు నర్సాపూర్ నియోజకవర్గ స్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ చేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్న ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ప్రజలు గుర్తించి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు భారీ మెజారిటీతో మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని గెలిపించాలని కోరారు. అదేవిధంగా హత్నూర మండలంలోని టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సన్నాహక సమావేశానికి భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి దామోదర్ రెడ్డి జడ్పిటిసిలు ఎంపీటీసీలు వివిధ గ్రామాల సర్పంచులు మరియు పట్టణ అధ్యక్షులు బిక్షపతి భూపాల్ రెడ్డి రామ గౌడ్ భోగశేఖర్ రమణ నర్సింలు మధుసూద మంజుల కాశీనాథ్ రాజు నాయక్ కల్లూరి హరికృష్ణ నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ నయీముద్దీన్ సునీతమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు బాదే శివశంకర్ రావు సత్యం గౌడ్ జ్ఞానేశ్వర్ శ్రావణ్ హత్నూర్ ఎంపీపీ వావిలాల నర్సింలు వైస్ ఎంపీపీ పండుగ రవి కుమార్ రామచంద్రారెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ గుండా రాములు మహంకాళి నాయిని వీరేందర్ మాయిని శ్రీకాంత్ నర్సింలు నాగేష్ గౌడ్ సురేందర్ రెడ్డి శంకర్ యాదగిరి చెక్క రవీందర్ గౌడ్ పండుగ శేఖర్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.


అభివృద్ధి  కేవలం బిఆర్ఎస్ పార్టీలోనే సాధ్యం
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుందామన్నారు