దైవ భక్తిని బిజెపిపార్టీకి ముడి పెట్టడం సరికాదు

దైవ భక్తిని బిజెపిపార్టీకి ముడి పెట్టడం సరికాదు

శ్రావణి అత్యుత్సాహమే అర్వీంద్ కొంప ముంచుతుంది 

 అభివృద్ధి చేసింది జీవన్ రెడ్డి 
 అబద్ధాలు చెప్పేది మీరు 

 ఓ వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావు 

 ప్రజల ఆస్తులు పెంచింది కాంగ్రెస్ 
 పన్నుల పేరు ఆ ప్రజల తోచింది బిజెపి 

 పార్టీ సీట్ కోసం కోట్లు తీసుకున్నది మీ ఎంపి అభ్యర్థి 


 జనం న్యూస్ రాయికల్ మే9


రాయికల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల పురపాలక సంఘం చైర్మన్ అడ్వాల జ్యోతి పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైవ భక్తిని అడ్డుపెట్టుకొని రాజకీయలు చేయాలనుకోవడం సరికాదని 
హిందువులుగా మేము ప్రతిరోజు ఆలయాలకు వెళ్లి దేవుళ్లను పూజిస్తున్నామని 
ఆలయాలకు విరాళాలు ఇచ్చామని, కొత్తగా పార్టీ మారిన మీరు ఏం చేశారో చెప్పాలని,కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే అనేక దేవాలయాలు అభివృద్ధి చేశారని స్వతహాగా మీరేం చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ పేటెంట్ రైట్ అయోధ్య శ్రీరాముడు కాదని ఆయన అందరి హిందువుల దేవుడు అని దాని పేరుతో ఏదో చేశామని చెప్పుకొని ఓట్లు ఓట్లు పొందాలని అక్రమ మార్గం సరికాదని ఆమె హితవు పలికారు
 శ్రావణి అత్యుత్సాహమే ఆర్వీంద్ కొంప ముంచుతుంది 
జగిత్యాల నియోజకవర్గంలో భోగ శ్రావణి ఆడిందే ఆట పాడిందే పాటగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుందని గత కొన్ని రోజుల క్రితం ఆమె తీరుతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల ఎంపీ అభ్యర్థి ఆర్వింద్ దిష్టి
బొమ్మను కూడ దాహానం చేశారని, వారి కుటుంబ కబ్జాల భాగోతం పై గతంలో వాళ్ల పార్టీ నాయకులే ఫిర్యాదులు చేశారని ,ఓ పూజారి భూమిని కూడ కబ్జా చేసిన ఘనత హిందువు గురించి గొప్పగా చెప్పుకునే గొప్ప శ్రావణి కుటుంబానికి దక్కుతుందని ఆమె హేద్దేవా చేశారు
 ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికావు 

ప్రతిసారి ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ పదేపదే కాంగ్రెస్ పార్టీకి జతకట్టి మాట్లాడే మీరు గత ఉగ్రవాద దాడుల గురించి అనేకసార్లు తెలిపారు కానీ  పుల్వామ దాడిలో కూడ మీ పార్టీ ప్రమేయం ఉందా? అని మేము అడగవచ్చు కానీ మా నాయకులు మాకు సంస్కారం నేర్పారు అని దేశ,భక్తిని దైవ భక్తిని జతకట్టి కేవలం ఓట్ల కోసం చిచ్చు రేపే చిల్లర స్వభావం సరికాదని తెలిపారు

 జీవన్ రెడ్డి అంటేనే అభివృద్ధి
 
ప్రతిసారి జీవన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించే 
కూహన వాదులు తెలుసుకోవలసింది,  జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి రోడ్డు ను జీవన్ రెడ్డి వేశాడని ఆ రోడ్డుపై తిరుగుతూ ఓట్లు అడుక్కునే అర్హత మీకు లేదని, అభివృద్ధి చేసే దమ్ము లేకుంటే భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పి ఓట్ల అడుగాలి కానీ పనిమలిన విమర్శలతో ఓట్లు రాబట్టు కోవాలనుకోవడం 
సరైనది కాదని జగిత్యాలలో మహిళా డిగ్రీ కళాశాల, జెఎన్టియు కళాశాల, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధిలో జీవన్ రెడ్డి శ్రమ ఉంటుందని గుర్తుంచుకోవాలని అన్నారు 
 వాస్తవాలు చెప్పేది కాంగ్రెస్ అబద్ధాలతో జిమ్మిక్కులు చేసేది బిజెపి 
కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనపై అనేక ఆరోపణలు చేసే మీరు మీ నాయకులు ఆ కాలంలో జరిగిన అభివృద్ధిని గ్రహించలేక పోతున్నారని మహిళల బంగారం లాక్కుంటారని ఒక హీనమైన వాఖ్యాలను ప్రచారం చేసేటప్పుడు గత 40 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎంతమంది బంగారం లాక్కున్నారో లెక్క చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు 
ప్రజా సంక్షేమం చేసి ఇందిరమ్మ పథకం ద్వార అనేక మంది పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు , వైద్య సౌకర్యాలు కల్పించి రుణాల ద్వార అభివృద్ధి చేసి ఈ యొక్క దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర ఎనాలేనిదని అవగాహన లేకుండా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని ఇదే బిజెపి ప్రజలపై పన్నుల భారం రుద్దుతూ జీఎస్టీ వేసి 
అత్యధిక నిత్యవసర సరుకుల ధరల ద్వారా పేద ప్రజలు నడ్డి విరుస్తుందని అబద్ధాలు చెప్పడం మానుకోవాలని అన్నారు 
 పార్టీ భిపాం కోసం కోట్లు తీసుకున్న మీ ఎంపి అభ్యర్థి 

ఇటీవల నిజమాబాద్ ప్రాంతంలో కార్పొరేషన్ సీటు కోసం కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారంటూ మీ ఎంపీ అభ్యర్థి పై పేపర్లో వచ్చిన వ్యాఖ్యలపై మీరు ఏం సమాధానం చెప్తారని అవినీతి నాయకుని కోసం మీరు ఎలా పని చేస్తారని ఆమె ప్రశ్నించారు 
 జీవన్ రెడ్డి పై ఒక చిన్న అవినీతి మరక కూడ లేదని ఆయన నిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తారని గుర్తించుకొని మాట్లాడాలని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది ఆమె హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మ్యాకల అనూరాధ,మమత,షర్మిల,వర్షిణి
ఎద్దండి భూమారెడ్డి, మ్యాకల రమేష్,భాపురపు నర్సయ్య, బత్తిని చిన్న భూమయ్య, నాగరాజ్ ,రాకేష్ నాయక్ ,రాజేష్, తదితరులు పాల్గొన్నారు.