నేడు కామదహనం, కాముణ్ణి ఎందుకు కలుస్తారు? ఉమాశేషారావు వైద్య లెక్చరర్

నేడు  కామదహనం, కాముణ్ణి ఎందుకు కలుస్తారు?  ఉమాశేషారావు వైద్య లెక్చరర్

జనం న్యూస్ మార్చ్ 23( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా )

ఆదివారం సాయంత్రం కామ దహనం నిర్వహించి  సోమవారం హోళిపండుగ నిర్వహించుకోవాలని పంచాంగం సూచిస్తోంది. అసలు కామదహనం ఎందుకు చేస్తారు?.కామదహనం వెనుక మతులబు ఏమిటి? భౌతిక కామ వాంఛలన్నీ తగలబెట్టి ధర్మబద్ధంగా జీవితం  గడపాలని ఉద్దేశంతో కామదహనం యొక్క పరమార్ధం. మనదేశంలో  హిందూధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి పండుగ ధర్మసింధు, నిర్ణయ సింధుప్రకారం పండితులు నిర్ణయిస్తారు. ఈసంవత్సరం 2024 పాల్గొనమాసంలో  ఆదివారం ఉదయం 9.30 నిమిషాల కు పౌర్ణమి ప్రవేశిస్తుంది. సూర్యో దయం తర్వాత వస్తుంది. కనుక సోమవారం పౌర్ణమి అనుసరి స్తారు. అందుచేత ఆదివారం కామదహనం నిర్వహించి సోమ వారం హోలీ పండుగ నిర్వహిం చాలనిపండితుల అభిప్రాయం. ఈపండుగను భారతదేశ ప్రజలం దరు కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. పురాణ గ్రంథాల ఆధారంగా చూడగా కామదహనం అనేది పార్వతిదేవి, పరమశివుడిని వివాహం చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచమని కామదేవుడిని అడుగుతుంది. అప్పుడు కామదేవుడు తపస్సులో ఉన్న  శివుడి ఏకాగ్రతను భంగ పరచడానికి అతనిపై  పూలబానం వదులుతాడు. తనతపస్సుకు భంగం కలిగించింది ఎవరు అని తన త్రినేత్రం తో దివ్యదృష్టితో చూడగా అది కామదేవుడు అనిగ్రహించి, తన ముక్కంటిని తెరిచి కామదేవుని శరీరాన్ని భస్మం చేస్తాడు. కామదేవుని భార్య రతీదేవి పరమశివుడి వద్దకు వెళ్లి వేడుకోగా తిరిగి కామదేవుడిని బతికిస్తాడు. శివుడు, కామాన్ని దహించిన సంఘటనకు ప్రాతికగా కామదహనం చేయడమనే ఆచారం నేటికి కూడా కొనసాగుతుంది. సహేతుకంగా గమనిస్తే మనిషిలోని కోరికలను దహింపజేసుకొని మానసిక ఆరోగ్యంపెంపొందించు కోవాలనేదే ఈ పండుగ ఉద్దేశ్యం. రంగునుచల్లుకోవడం లో ఆంతర్యం హిరణ్యకషపుడి  చెల్లెలైన హోలికా రాక్షసి చనిపోవడంవల్ల ఆమె బాధల నుంచి విముక్తి అయినందుకు సంతోషంగా రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ హోళీక మహోత్సవాన్ని నాటి నుంచి నేటి వరకు కొనసాగిస్తూ ప్రజలు ఒకరి పై మరొకరు రంగులు చల్లుకొని ఆనందోత్సవాల మధ్య హోలిని జరుపుకుంటున్నారు. కాముడిని భస్మీపటలం  చేయడంతో అంతర్లీ నంగా మనకు ఒక సందేశం కనబడుతుంది. కాముడు ప్రతి మనిషిలోనూ అదృశ్యరూపంలో అంతటా వ్యాపించి ఉంటాడు. ప్రతి మనిషిలో అంతర్లీనంగా దాగివున్న అరిషడ్వర్గాలు  రాగ, ద్వేష,కామ, క్రోధ, మోహ, మాయ మొదలగుణాలను ప్రజ్వరీల్లకుండా మనసును ఆధీనంలో పెట్టుకోవాలని దీని ఉద్దేశంమని, మనిషిలో కోరికలు గుర్రంలా స్వారీచేస్తే మనిషి బ్రష్టుపట్టి పోతాడు మనిషిలోని రజో, తామసగుణాలను పారదోలి సాత్విక గుణం తో జీవిస్తే మనిషి జన్మకు సార్ధకత లభిస్తుంది. మనిషిని మహానీయుడుగా మార్చే మహత్తర శక్తి మనసుకుంటుంది. ఆ మనస్సుని ఆధీనంలో పెట్టుకునే శక్తి   కేవలం మనుషులకు ఉంటుంది. మనసును శరీరాన్ని ఆధీనంలో   పెట్టుకోగలిగిన వారు మహనీ యులవుతారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం  ద్వారా మనుషుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయని అంటారు. కొన్ని ప్రాంతాల్లో డోలోత్సవంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు గోపి కలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని నిర్వహించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. హోలీ జరుపుకునే వ్యక్తులు సహజమైన రంగులన వాడాలి. రసాయన  రంగులు వాడి నట్లయితే చర్మ వ్యాధులువచ్చే అవకాశం ఉంటుంది. కనుక సహజసిద్ధమైన శరీరానికి హాని కలగని రంగులనే వాడుదాం గ్రామాల్లో కొంత మంది ప్రజలు డప్పుచప్పట్ల తో ఇంటింటికి వెళ్లి పాటలుపాడుతు హోలీ సందర్భంగా డబ్బులు అడుగు తారు.   బావ మరదలు బావా బామ్మర్దులు వదినే మరదలు  వరుస వరుస లో పోటీపడి రంగులు చల్లుకొని ఆనందం వ్యక్తం చేసుకుంటారు.హోలీ ఆడిన తర్వాత దావత్  చేసుకోవడం అనవాయితిగ మారింది. ప్రతి పండుగ ఉద్దేశం ఒక పర మార్థం దాగి ఉందని ఈ పండు గ బట్టి తెలుస్తుంది. చిన్న పిల్లలు ఉల్లాసంగా మైమరచిపోయి అడుతారు. ఈ మధ్య స్త్రీలు గుంపులు గుంపులుగా చేరి రంగులు ఆడుతూ 
మానసిక ఆనందాన్ని పొందు తున్నారు.