'పల్లెకు పదాం ' అనే కార్యక్రమం పై అవగాహన .

'పల్లెకు పదాం '  అనే కార్యక్రమం పై అవగాహన .

జనం న్యూస్ ఫిబ్రవరి మూడు కాట్రేనుకున బిజెపి ముమ్మిడివరం అసెంబ్లీ కొ కన్వీనర్ అధ్యక్షతన  స్వామి జరిగిన పల్లెకు పోదం 9,10,11 తేదీలలో జరగబోయే ( గావ్ చలో  అభ్యాన్ ) అనే కార్య్రమం పై అవగాహన సదస్సు కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోనల్ ఇన్చార్జి కాశీ విశ్వనాథ రాజు , రాష్ట్ర ఉాధ్యక్షుడు, మాజీ శాససభ్యుడు ఆయ్యజి వేమా మనెపల్లి ముఖ్య అదితులుగా పాల్గొన్నారు.  ఈ అవగాహన కార్యక్రమంలో  కాశీ విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ పల్లెకు పోదాం కార్యక్రమం లో బాగంగా కార్యకర్తలు, నాయకులు తమకు నియమించిన పల్లెలకు వెళ్లి  అక్కడి ప్రజలతో మమేకమై , అంగన్వాడీ అషా వర్కర్స్ సహాయంతో మహిళలకు ఇస్తున్న కేంద్ర లబ్దిని వివరించడం,  గుర్తింపు లేక కలిగే వున్న మిగతా పార్టీల  లో నీ నాయకులను కలిసి మన పార్టీలోకి ఆహ్వానించడం,  కేంద్ర పదకాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి పార్టీ మానిఫెస్టో వివరించడం,  కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం గూర్చి వివరించడం,  370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలక్ రద్దు గూర్చి వివరించడం అనే కార్యక్రమాలను ఈ పల్లెకు పోదాం అనే కార్యక్రమం కోసం పల్లెలలో ఉండి చేయాలన్నారు. ఈ కార్య్రమానికి  జిల్లా ఇంఛార్జి  పొట్లూరి రామ్మోహన్ రావు,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలురీ సత్యనాందం, ఆడబాల సత్యనారాయణ,  జిల్లా ప్రధాన కార్యదర్శిలు మోకా వెంకట సుబ్బారావు,  ఇళ్ల సత్యనారాయణ,  గనిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారి గ్రంధి నానాజీ  మండలాల ప్రెసిడెంట్ లు సెక్రటరీలు మండల నాయకులు జిల్లా నాయకులు బూత్ కమిటీ ఇంచార్జ్ లు  తదితరులు పాల్గొన్నారు.