ప్రజా సంకల్పానికి ఆరేళ్లు

ప్రజా సంకల్పానికి ఆరేళ్లు

జనం న్యూస్ 06 నవంబర్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం వైయస్ జగన్ పాదయాత్ర సుపరిపాలన సంకల్పానికి ఆరేళ్లు తో పూర్తయినందున టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలంలో సోమవారం స్థానిక విద్యాశాఖ కార్యాలయం వద్ద నున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తదుపరి కార్యకర్తలతో నాయకులతో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర గురించి మాట్లాడుకున్నారు పిఎసిఎస్ అధ్యక్షులు బాడాన మురళి, మండలం పార్టీ అధ్యక్షులు నూక సత్య రాజు, బోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించిన రోజు ప్రజా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖిస్తూ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించిన ఆరేళ్ళు. ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు మెరుగుపడేలా విప్రవాత్మక సంస్కరణలను శ్రీకారం చుట్టి పెట్టడానికి తోడ్పడినటువంటి పాదయాత్రను ప్రారంభించి ఆరు ఏళ్ళు పూర్తయిన రోజు జగనన్న తన పాదయాత్రలో అన్ని వర్గాల వారితో మేధావులతో విద్యార్థులతో కులాలతో అన్ని రకాల వ్యాపారస్తులతో చర్చలు జరిపి అధికారంలోకి వస్తే ఏమి చేయాలో తెలుసుకుంటూ పాదయాత్ర చేశారు .జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత పాదయాత్రలో మ్యానిఫెస్టో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చిన మహానీయుడు జగన్ అన్న అని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చేసిన ఘనత జగనన్నది అందుకే రాష్ట్రంలో లక్షలాదిమంది తో ర్యాలీలు బహిరంగ సభలు జరుగుతున్నాయని అన్నారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు దుక్క రోజా రామకృష్ణ, ,వెలమ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ దుంగ సిమ్మన్నమాస్టర్ ,మండల విప్ బొడ్డు అప్పన్న,మండల జెసిఎస్ కన్వీనర్ గెడ్డవలస నాగభూషణరావు,జిల్లా రైతు భరోసా అడ్వైజరీ కమిటీ మెంబరు కవిటి రామరాజు,సర్పంచులు సుంకరి జనార్దన్ రెడ్డి, నేతింటే అప్పలస్వామి ,బమ్మిడి గణపతి స్వామి, తలగన గణపతి మాస్టారు,శివారెడ్డి , కాళ్ళ సంజీవ్,బోయిన,మాధవి కృష్ణారావు సోషల్ మీడియా కన్వీనర్ సింగూరు నారాయణరావు, కార్యకర్తలు బలగ సూర్యారావు, గుట్ల లక్ష్మణరావు వాన ఆదినారాయణ, దుబ్బ సింహాచలం, అక్కురాడు సురేష్,దండాసి సింహాచలం, తోట సింహాచలం, తోట శ్రీరామ్,అల్లు ప్రసాద్ ,పైల కేశవ్ ,సకలభక్తుల శ్రీనివాసరావు హనుమంతు శేషగిరి ,నెయ్యల సురేష్ కొత్తపేట వైస్ ప్రెసిడెంట్ దుర్గారావు టెక్కలి నియోజకవర్గ ప్రతినిధి బమ్మిడి శ్రీనివాసరావు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు