ప్రతి చెరువుకు సాగునీరు.. ప్రతి గ్రామానికి తాగునీరు ఇస్తాం

ప్రతి చెరువుకు సాగునీరు.. ప్రతి గ్రామానికి తాగునీరు ఇస్తాం

ఈ ఐదేళ్లలో ప్రకాష్ రెడ్డి ఎన్ని చెరువులు నింపారో చెప్పాలి

మాటలతో కాలం గడపటం కాదు.. ప్రజల కష్టాలు చూశావా

ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పరిటాల సునీత

నిధుల కొరతతోనే పింఛన్లు ఇవ్వకలేకపోతున్నారు

టీడీపీ అధికారంలోకి వచ్చాక.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి చెరువుకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇవాళ అనంతపురం రూరల్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని చిన్నంపల్లి, కామారుపల్లి, బీసీ కాలనీ, సంతోష్ నగర్, మటన్ మార్కెట్, మల్లయ్య కాలనీ, కురుగుంట, YSR కాలనీ, రమణ కొట్టాలు, సునీతమ్మ కాలనీ, పాత ఎస్సి కాలనీల్లో సునీత ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు సునీతకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు కాలనీల్లో సమస్యల్ని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం సునీత మాట్లాడుతూ నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ ఉన్నా... ఏ రోజు చెరువులకు నీరు ఇచ్చిన దాఖలాలు ఈ ఐదేళ్లలో లేవన్నారు. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు అందించానని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పక్కనే కాలువ ఉన్నా.. చాలా చెరువులకు నీరు ఇవ్వలేని అసమర్థ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. అందుకే చాలా గ్రామాల్లో బోర్లు కూడా ఎండిపోయి.. తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ ఐదేళ్ల పాటు అవినీతి మత్తులో ఉన్న ప్రకాష్ రెడ్డి ఇప్పుడే నిద్రలేచి.. రూరల్ కాలనీలకు తాగునీరు ఇస్తానంటూ బయలుదేరారని ఎద్దేవా చేశారు. ఇలాంటి మోసపు నాయకుల్ని ఇంటికి పంపే సమయం వచ్చిందని..ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు..

వైసీపీ నుంచి టిడిపిలోకి చేరికలు

రాప్తాడు నియోజకవర్గంలో వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం రూరల్ మండలం, చిన్నంపల్లి పంచాయతీ, సంతోష్ నగర్ కి చెందిన వైకాపా మైనారిటి నాయకులు అల్లాబకష్, షేక్ ఫజల్ ఖాన్, షబ్బీర్, ఫకృద్దీన్ తదితరులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మాజీ మంత్రి పరిటాల సునీత వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు...

నిధుల కొరతతోనే పింఛన్లు ఇవ్వలేకపోతున్నారు

జనం న్యూస్ ఏప్రిల్ 1 జిల్లా ఇన్చార్జ్...ప్రతినెల అవ్వా తాతలకు అందాల్సిన పింఛన్ల సొమ్మును కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన ఘనుడు సీఎం జగన్ రెడ్డి అని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మార్చి 16 నుంచి 30వ తేదీ మద్య ఈ 15రోజుల్లోనే ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని విమర్శించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులు కొరతే కారణం గాని ఎన్నికల కమిషన్, తెలుగుదేశం కాదన్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచే ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని నిలదీశారు. 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా యుద్దప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 3వ తారీషు నుంచి పింఛన్లు పంపిణీ చేస్తారని మార్చి 28న సాక్షి దినపత్రికలో జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పిన వార్త వచ్చిందన్నారు. ఎందుకు ఇలా సాక్షిలో రాశారన్నది అందరికీ అర్థమవుతోందన్నారు. ఈ వాస్తవాన్ని కప్పిపెట్టి ఎన్నికల లబ్ది కోసం దుష్ప్రచారం చేస్త్తోందన్నారు. జగన్ రెడ్డి స్వార్ధ రాజకీయం వల్లే ఫించన్ దారులు, వాలంటీర్లు నష్టపోతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు రూ. 4,000 పింఛన్ అందిస్తుందన్నారు. ఒకవేళ ఈ 2నెలలు ఎవరికైనా పెన్షన్ అందుకుంటే అది కూడా కలిపి ఇస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి మెరుగైన జీతం వచ్చేలా చూస్తామన్నారు.