ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు.

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు.

జనం న్యూస్ 5 ఏప్రిల్ ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ :

 భారత తొలి ఉప ప్రధాని, సమ సమాజ స్థాపనకు కృషి చేసిన కృషివలుడు డా: బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకను ఘట్కేసర్ మున్సిపల్ పరిధి డైనో కంపెనీ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ప్రముఖ రాజకీయ నాయకులు
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏప్రిల్ 1908 తేదీ నాబాబు జగ్జీవన్ రామ్ జన్మించాడు ప్రముఖ భారతీయ కార్యకర్త షెడ్యూల్ కులాల వంటి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారు బీహార్లో అంటరాని వారిగా పరిగణింపబడే కులంలో జన్మించి ప్రాథమిక విద్యను అభ్యసించి సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత అతని సామాజిక కార్యాచరణ  1936 నుండి    1996 వరకు పనిచేసి 50 సంవత్సరాల నిరంతర పార్లమెంటేరియన్ గా రికార్డ్ సంపాదించాడు
అతి చిన్న వయసులో కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని చేపట్టి రక్షణ మంత్రిగా తర్వాత 1977 నుండి 79 వరకుఉప ప్రధానిగా పని చేశారని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు  శ్రమించి దళితుల ఐకాన్ స్థాయికి ఎదిగిన ఆయన 1986లో మరణించడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ళ ముత్యాల యాదవ్ సహకార బ్యాంకు చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పత్తి కుమార్ బి బ్లాక్ ఎస్సీ సెల్ మహేష్ ఘట్కేసర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్ కొంతం అంజిరెడ్డి మేడ బోయిన వెంకటేష్ ముదిరాజ్  మేకల సునీల్ కుమార్ ఉల్లి ఆంజనేయులు యాదవ్ కే నాగరాజు ముదిరాజ్  బండారి రాందాస్ డాక్టర్ జంగయ్య డాక్టర్ మీసాల మల్లేష్ ఏనాతుల నాగేష్, తాల్కా రాములు మోత్కుపల్లి శ్రీనివాస్ ఇరిటం శ్రీనివాస్ కడుపోల్ల  సుధాకర్ కడుపోల్ల  రాజు కడుపోల్ల  నరేష్ అంబేద్కర్ అభిమాన సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.