ప్రారంభానికి నోచుకోని కొనుగోలు కేంద్రాలు.

ప్రారంభానికి నోచుకోని కొనుగోలు కేంద్రాలు.

జనం న్యూస్. 23 మార్చ్. నిజామాబాద్( రూరల్ ప్రతినిధి) ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్చి మొదటి వారం నుండి కోతలు మొదలైనప్పటికీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాల జాడే లేదు గత వారం కింద కురిసిన భారీ రాళ్లవాన సందర్భంగా కనీసం ధాన్యాన్ని ఆరబెట్టడానికి ప్లాట్ఫారం లేకపోవడం కోసిన వరి ధాన్యాన్ని ఏమి చేయాలో తెలియక మిల్లర్లు దళారులను రైతన్న ఆశ్రయిస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాకుండా క్వింటాల్కు 1800 నుండి 1900 వరకు మాత్రమే కొంటున్నారు వాస్తవానికి ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి మద్దతు ధర  2203 సాధారణ రావడానికి 2183 గా ప్రకటించింది కానీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం నిల్వ చేయడానికి గోదాములు కానీ ఏ లాంటి అవకాశాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు వాస్తవానికి భారత ఆహార సంస్థ వరి కోత కంటే రెండు వారాలు ముందే కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తే రైతులకు ఇలాంటి కష్టాలు రావు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిల్లర్ల నుండి దళారుల నుండి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఒకసారి రైతుల మీద దృష్టి సారిస్తే ప్రభుత్వం తరఫున రైతులకు కొంతవరకైనా మేలు జరుగుతుందేమో ప్రభుత్వం చేరికల మీద ఉన్న దృష్టి రైతుల మీద చూపిస్తే ప్రతి రైతు రాజే అవుతాడు