సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్ సరి చేయాలని డైరెక్టర్ పా కు విజ్ఞప్తి : కోటా శివశంకర్

సింగరేణి   ఉద్యోగ  నోటిఫికేషన్ సరి చేయాలని  డైరెక్టర్   పా  కు విజ్ఞప్తి  :   కోటా శివశంకర్

జనం న్యూస్  24 మార్చి   కొ త్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ 

సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ లో కచ్చితంగా దివ్యాంగులకు వారి రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలను కేటాయించా లని నిరుద్యోగుల కోసం ఎక్స్టర్నల్ పోస్టులను పెంచాలని ఇంటర్నల్ పోస్టులలో 360 జూనియర్ అసిస్టెంట్ పోస్టల్ లో మహిళలకు దివ్యాంగులకు రిజర్వేషన్ కేటాయించలేదని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ పా గారికి వినతి పత్రం అందించడం జరిగింది....... సింగరేణి యాజమాన్యం గత వారం రోజుల క్రితం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని అందులో ఇంటర్నల్ అభ్యర్థులకు ఎక్కువ పోస్ట్లు కేటాయించడం జరిగింది దీని వలన చదువుకున్న నిరుద్యోగులు చాలా అన్యాయమైపోతారని అదేవిధంగా ఇంటర్నల్ పోస్టులలో దివ్యాంగులకు మహిళలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో రిజర్వేషన్లు కల్పించలేదని ఇది చాలా అన్యాయమని ఇది రాజ్యాంగ విరుద్ధమని కోటా శివశంకర్ డైరెక్టర్ పా గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అదే విధంగా సింగరేణి యాజమాన్యం నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎక్స్టర్నల్ అభ్యర్థుల కోసం పోస్టుల సంఖ్యను పెంచాలని కొత్త పోస్టులు కూడా నోటిఫికేషన్ లో చేర్చాలని టెక్నికల్ నాన్ టెక్నికల్ కింద ఇంకా తదితర రంగాల్లో సింగరేణి కి అవసరమైన మిగతా పోస్టులను కూడా నోటిఫికేషన్ లో చేర్చాలని డైరెక్టర్ పా కు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక నీళ్లు నియామకాలు నిధులు అనే నినాదంతో నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు సాధించి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేయడంలో విఫలమై ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యారని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సింగరేణిలో ఎక్స్టర్నల్ అభ్యర్థుల కోసం ఎక్కువ పోస్ట్లు కేటాయించాలని కోటా శివశంకర్ డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో మహిళలకు దివ్యాంగులకు వారి రిజర్వేషన్ ప్రకారం ఖచ్చితమైన కోట ప్రకారం పోస్ట్లు కేటాయించాలని అదేవిధంగా ఎక్స్టర్నల్ అభ్యర్థుల కోసం ఎక్కువ పోస్టులను నోటిఫికేషన్ లో చేర్చాలని వెంటనే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ సరిచేసి ఇటు ఇంటర్నల్ అభ్యర్థులకు అటు ఎక్స్టర్నల్ అభ్యర్థులకు అందరికీ సమన్యాయం చేయాలని సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని  సింగరేణి డైరెక్టర్ పా విజ్ఞప్తి చేయడం జరిగింది