విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పనులు పూర్తయిన ఓపెన్ కానీ ఐజ పెద్దవాగు బ్రిడ్జి.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పనులు పూర్తయిన ఓపెన్ కానీ  ఐజ పెద్దవాగు  బ్రిడ్జి.

జనం న్యూస్ 24 మర్చి
జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా అయిజ మండలం ఐజ నడిబొడ్డున ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి పై వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
గత ఆరు నెలల క్రితం బ్రిడ్జిని కూలగొట్టి అదే ప్రాంతంలో కొత్త  బ్రిడ్జిపై  మూడు నెలల్లో  బ్రిడ్జి పై రాకపోకలు కొనస్తావిస్తామన్న కాంట్రాక్టర్.

ఐజ ప్రజలకు తెలియజేయడం ఏమనగా పెద్దవాగు బ్రిడ్జి పనులు పూర్తయినప్పటికీ. ఇంకా రోడ్ అప్రోచ్ చేయాలంటే అది 10 పది రోజుల్లో పూర్తవుతుంది. 

 బ్రిడ్జి పై రాకపోకలు కొనసాగించవచ్చు,

కానీ ఇంకా 6 నెలలు ఉన్నా బ్రిడ్జి ఓపెన్ కాదని స్థానికులు చెప్పుకొస్తున్నారు.

ఎందుకు అని అడగగా  రోడ్ అప్రోచ్ వేయాలంటే బ్రిడ్జి పక్కల ఉన్నా కరెంట్ స్తంబాలు తీయాలి. కానీ విద్యుత్ అధికారులు పట్టించుకోవడంలేదు.
కరెంట్ స్తంబాలు తీస్తే 10 రోజుల్లో అప్రోచ్ వేసి బ్రిడ్జి ఓపెన్ చేస్తాము అంటున్నారు బ్రిడ్జి కాంట్రాక్టర్..విద్యుత్ అధికారులు  సహకరించి స్తంభాలను ఇతర ప్రాంతాలకు మారిస్తే కేవలం పది రోజుల్లో మాత్రమే బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం అవుతాయని వారు చెప్పుకొచ్చారు. 
విద్యుత్ అధికారులు స్తంబాలు  మార్చకుంటే  ఇంకా 6 నెలలు ఉన్నా బ్రిడ్జి ఓపెన్ కాదని వారు చెప్పుకొస్తున్నారు.. విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయడమేమనగా దయచేసి ఈ బ్రిడ్జి పక్కనున్న కరెంట్ స్తంభాలను వెంటనే మీ విద్యుత్ అధికారుల సాయంతో మారిస్తే ఈ బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగుతాయని దయచేసి మండలం మరియు ఇతర ప్రాంతాలకు  పోయే వాహనదారులు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నారుదయచేసి పై అధికారులు చొరవ తీసుకొని  విద్యుత్ స్తంభాలను ఇతర ప్రాంతానికి మార్చే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు..
ఐజ,మరియు ఇతర ప్రాంతాలకు పోయే ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు..
జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా