బుచ్చంపేటలో ఆరోగ్య సురక్ష 2* *

బుచ్చంపేటలో ఆరోగ్య సురక్ష 2*  *

*ప్రజల ఆరోగ్యమే భవిష్యత్తుకు శ్రీరామరక్ష: నియోజకవర్గ ఇన్చార్జ్ తలే రాజేష్*

జనం న్యూస్. జనవరి. 10. విజయనగరం జిల్లా. రాజాం.

రాజాం మున్సిపాలిటీ పరిధిలో బుచ్చిం పేట గ్రామంలో ఈరోజు నిర్వహించినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష 2 అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ తలే రాజేష్ గారు పాల్గొన్నారు. అయన మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజల ఆరోగ్య భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని ఆయన అన్నారు. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయముగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపు స్టాల్స్ ను పరిశీలించిన అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీను వాసరావు గారు, రాజాం మున్సిపల్ కమిషనర్ కమిషనర్ నాగరాజు గారు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు...