భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించే,5మండలాల బూత్ స్థాయి సమావేశం.

భారత రాష్ట్ర సమితి పార్టీ నిర్వహించే,5మండలాల బూత్ స్థాయి సమావేశం.

స్థల పరిశీలన చేసిన బిఆర్ఏస్ ప్రజాప్రతినిధులు.
జనం న్యూస్.ఏప్రిల్ 25. కొమురం భీమ్ జిల్లా. స్టాఫ్ఫర్.

జైనూర్ :- పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారంతో పాటు 5మండలాలైన జైనూర్ ,సిర్పూర్ (యు),లింగపూర్ ,నార్నూర్ ,
గాదిగూడ బూత్ స్థాయి కార్యకర్తలకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన. ఆదిలాబాదు ఎమ్మెల్సీ దండే విఠల్ , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి,ఆదిలాబాదు పార్లమెంట్ బిఆర్ఏస్ అభ్యర్థి ఆత్రం సక్కు ఇట్టి సమావేశంలో శుక్రవారం దిశానిర్దేశం చేయనున్నారు.జైనూర్ మండలంలోని కాలేజీ గుడ ప్రాంతంలో బూత్ స్థాయి సమావేశనకు బిఆర్ఏస్ ప్రజాప్రతినిధులు స్థల పరిశీలన చేశారు.ఇట్టి బూత్ స్థాయి సమావేశమునకు సకాలంలో బిఆర్ఏస్ శ్రేణులు శుక్రవారం తరలిరావాలని వారు కోరారు.ఈ సందర్బంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు,సహకార చైర్మన్ కోడప హన్నుపటేల్ ,బిఆర్ఏస్ పార్టీ అధ్యక్షులు ఇంతియాజ్ లాల,లు మాట్లాడారు.బిఆర్ఏస్ ప్రభుత్వం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ 9ఏళ్లుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చెపట్టారని గుర్తుచేశారు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతని నాటి పాలకులు ఏడారిగా మార్చరన్నారు,కానీ 4కోట్లతెలంగాణ ప్రజల ఆకాంక్షకోసం ఉధ్యమనేత కేసిఆర్ తెలంగాణ ప్రజలను ఏకం అప్పటి
యుపిఏ ప్రభుత్వం యొక్క మెడలు వంచి తెలంగాణ సాధించిన ఘనత కేసిఆర్ దే నని వారు అన్నారు.తోమ్మిది ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ని మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు,ప్రజలకు దేశంలో ఏక్కడ లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించారని,కానీ మాయదారి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యంకాని హామీలను ఇచ్చి గద్దెనెక్కినారు అని అన్నారు,ఇచ్చిన హామీలను గాలికివదిలి కేసిఆర్ ను బిఆర్ఏస్ ప్రజాప్రతినిధులను తిట్టుకుంటుతిరుగుతున్నారన్నారు,రాష్ట్రంలో బిఆర్ఏస్ పార్టీ తరుపున 9నుండి 12 పార్లమెంట్ సీట్లను ఖచ్చితంగా గేలుస్తాం అన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఆత్రం సక్కు గెలవడం కాయం అని వారు తెలిపారు.బిజెపి,కాంగ్రెస్ లోని ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు బిఆర్ఏస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కుకు పోటికాదన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మడవి భీం రావు,పెందోర్ లచ్చు,జనవర్ పవన్ ,జాలీషాతదితరులు ఉన్నారు