రాజ్యాధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం అడుక్కునే పరిస్థితి మనకెందుకు..?

రాజ్యాధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం అడుక్కునే పరిస్థితి మనకెందుకు..?


అమలు కానీ  హామీలతో ప్రజల చెవిలో పూలు పెడుతున్న బిఆర్ఎస్

ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్.

బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణి.

 బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భోగ శ్రావణి మాట్లాడుతూ 

 (జనం న్యూస్) నవంబర్23 రాయికల్ పట్టణ ప్రతినిధి. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని వారి ఆకాంక్షలు నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు అండగా ఉంటామని ప్రకటిస్తూనే వరి ధాన్యంలో కోత విధించి రైతుల చెవిలో పూలు పెట్టిందన్నారు. డబుల్ బెడ్ రూమ్ హామీ ఇచ్చి ఆ హామీ నెరవేర్చకుండా నిరుపేదల మోసం చేసిందన్నాను గాలికి వదిలేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ కుల,మత, వర్గ బేధాలు లేకుండా సకల జనుల సౌభాగ్యం, అభివృద్ధి ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్టు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే అర్హులైన నిరుపేదలందరికీ ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో వివిధ కారణాల చేత 13 లక్షల రేషన్ కార్డులను తొలగించారని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి పారదర్శకంగా ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బిజెపి పని చేస్తుందని వరికి రూ.3100 మద్దతు ధరతో పాటు ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తామన్నారు. ఫసల్ బీమా యోజన అమలు చేసి పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు. పసుపు రైతులను ఆదుకోవడం కోసం పసుపు బోర్డు తో పాటు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ను ఏర్పాటు చేస్తామన్నారు.   మహిళకు రూ.2 లక్షలు అందజేస్తామన్నారు. పొదుపు సంఘాలకు ఒక శాతం వడ్డీతో రుణాలు అందజేస్తామని తెలిపారు. నిరుపేద మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లను అందిస్తామన్నారు.   ఇప్పటివరకు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని ఈసారి బలహీనవర్గాలకు చెందిన ఆడబిడ్డనైన తనను ఒక మారు ఎమ్మెల్యేగా గెలిపించి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని బోగ శ్రావని కోరారు.సారంగపూర్ మండల్ తలుపుల గూడెం గ్రామం వెళ్లగా అక్కడ ఉన్న వారి పరిస్థితి చూసి చలించిపోయి రు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తూ ఒకే వర్గానికి లబ్ధి చేకూరేలా మేనిఫెస్టోను రూపొందించి మెజార్టీ ప్రజల ఆకాంక్షలఉన్నపాలంగా అక్కడికి అక్కడే గ్రామన్ని దత్తత తీసుకున్నట్టు ప్రకటించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు ఎండబెట్ల వరుణ్ కుమార్,మండల కార్యదర్షి కల్లూరి రాజు, మహిళ మోర్చా అధ్యక్షురాలు జమున,మండల మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి జ్యోతి,మండల యువ మోర్చా అధ్యక్షులు దిటి వెంకటేష్, గ్రామ పంచాయతీ వార్డ్ మెంబెర్ దువాక నర్సయ్య ,బూత్ అధ్యక్షులు సుంకం వేణు, చెన్నవేని రాజేష్,గుగులోత్ అంజి ,బుర్ర రాజశేఖర్, బీసీ సంఘం అధ్యక్షులు బాస నాగేందర్,గంగపుత్ర సంఘము అధ్యక్షులు నర్సయ్య, ఎస్టీ మోర్చా అధ్యక్షులు మల్లేష్ మున్నూరు కాపు ఉపాధ్యక్షులు గడ్డం గంగారెడ్డి,ఆకుల పొచ్చన్న, గంగారెడ్డి,చిన్నయ్య, రాజు,శేఖర్,నర్సయ్య, వెంకటేష్, జుంబర్తి విజయ్, నవీన్కార్యకర్తలు,యువకులు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.