వాహన తనిఖీల్లో పట్టుబడ్డ అయిదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల విలువ గల బంగారము.

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ అయిదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల విలువ గల బంగారము.

జిల్లా ఎస్పి చందనా దీప్తి 

(జనం న్యూస్ నల్గొండ జిల్లా ఇన్చార్జి ముత్యాల సురేష్ మార్చి 18)

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా, ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఓటర్లను ప్రలోభ పెట్టే నగదు, మద్యం మరియు ఇతర వస్తువుల అక్రమ రవాణాకు చెక్ పెట్టడానికి జిల్లా పోలీసు యంత్రాగం గట్టి నిఘా పెడుతూ ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని జిల్లా ఎస్పి తెలిపారు

ఈ క్రమంలో ఈరోజు అనగా తేదీ: 18.03.2024 నాడు అందాజా 11.30 గం. ల సమయములో మిర్యాలగూడ పట్టణములోని ఈదుల గూడ చౌరస్తా వద్ద DSP, మిర్యాలగూడ రాజ శేఖర రాజు ఆధ్వర్యములో శ్రీ G. సుధాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, మిర్యాలగూడ-1 టౌన్, B. శ్రీనివాస్, సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, మరియు HC-V. సైదులు, PCs-G. హుస్సైన్, P. నాగరాజు మిర్యాలగూడ-1 టౌన్ ల సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వైపు వెళ్తున్న TS09 UE 2479 నెంబరు కలిగిన బోలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా వాహనములో అందాజ అయిదు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయల విలువ గల బంగారమును రవాణా చేస్తున్నట్లు గమనించి ఫ్త్లెయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు మేరకు వాహనమును ముగ్గురు వ్యక్తులను బంగారముతో సహా స్వాధీనములోనికి తీసుకుని విచారణ చేపట్టనైనదని తెలిపారు.