సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా జాగ్రత్త.

సంక్రాంతి పండుగకు ఊరు వెళ్తున్నారా జాగ్రత్త.

. జనం న్యూస్ జనవరి 13, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది తమ సొంత గ్రామాలకు వెళ్తుంటారు ఇదే అదునుగా దొంగలు పడే అవకాశాలు ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని చనుగోముల ఎస్సై గిరి అన్నారు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకుల్లో, లాకర్లలో బద్ర పరుచుకోవాలన్నారు. మన పక్కింటి వారికి ఇంటి పరిసరాల ను గమనించాలని చెప్పాలి, ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ కూడా వేయాలి, అలాగే ఇంటి తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది మనము ఎక్కడికి వెళ్ళినా సిసి కెమెరాలు నుండి మన ఫోన్లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఎవరన్నా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరుగుతుంటే వారిపై నిగా పెట్టి 100 డయల్ కు కానీ సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి, ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్డు నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ ప్రశాంతంగా క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకొని సంతోషకరంగా పండుగ జరుపుకోవాలని చనుగోముల్ ఎస్సై గిరి తెలిపారు.