హస్తం గెలుపు తప్పదు తోటకూర వజ్రేష్ యాదవ్

హస్తం గెలుపు తప్పదు తోటకూర వజ్రేష్ యాదవ్

జనం న్యూస్ 22 నవంబర్ ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ :

మేడ్చెల్ జిల్లా ఘట్కేసర్ మండలం లోని అంబేద్కర్ చౌరస్తా , అంబేద్కర్ నగర్ మరియూ లో నిర్వహించిన కార్నర్ మీటిoగ్ లో మాజి ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ తో కలిసి పాల్గొన్న వజ్రేష్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లారెడ్డి అరాచకాలకి చెక్ పెట్టే సమయం వచ్చింది, అభివృద్ధి చేయలేదు కాబట్టే రోజు ప్రచారానికి రావడానికి వెనకడుగు వేస్తున్నాడు అని , మల్లా రెడ్డి ఓటు అడగడానికి వస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. బ్యాంక్ సొసైటీ డైరెక్టర్ సింగిరెడ్డి రాంరెడ్డి మాజి ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, మరియు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.