హామీలు అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించండి"

హామీలు అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించండి"

 సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్

 జనం న్యూస్ నవంబర్ 8 (సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి విజయ్ కుమార్)  సిద్దిపేట జిల్లా చేర్యాల  ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..  నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి మోసం చేయడానికి బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని ప్రజలు గమనించి ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, ఖాళీగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్లు వేసి పేపర్ లీకులు చేశారని, ప్రాజెక్టులు కడితే పిల్లర్లు కుంగిపోతున్నాయని ఇది ప్రభుత్వ అసమర్థత పాలనకు నిదర్శనం అని అన్నారు. రైతంగానికి రుణమాఫీ, అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల మంజూరు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలు నిర్వహిస్తుంటే డివిజన్ ప్రకటన చేయకుండా ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీని చెత్తుగా ఓడించాలని కోరారు.  ఈసమావేశంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, సీపీఐ కొమురవేల్లి, మద్దూరు, ధూల్మిట్ట మండలాల కార్యదర్శులు కుడిక్యాల బాల్ మోహన్, జంగిలి యాదగిరి, వలబోజు నర్సింహా చారి, సీనియర్ నాయకుడు పోలోజు నర్సయ్య ఉన్నారు