కాస్తయినా బుద్ధి ఉందా.. నడి రోడ్డుపై ఎంటి ఈ పనులు.. బూతులు తిడుతున్న నెటిజన్లు.. (వీడియో చూడండి)

జనం న్యూస్: చాలామంది జీవితాలు ఉరుకులు, పరుగులతో సాగిపోతున్నాయి. చాలా హెక్టిక్ షెడ్యూల్. జీతం వేటలో పడి.. జీవితాన్ని చాలా టెన్షన్‌తో గడుపుతున్నారు. అలాంటి ఓ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తూ.. ల్యాప్‌టాప్‌లో జూమ్‌ కాల్‌కు హాజరయ్యాడు. ఒడిలో ల్యాప్ టాప్ పెట్టి… బైక్ డ్రైవింగ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. “బెంగళూరు బిగినర్స్‌కు కాదు” అని దీన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ విచిత్రమైన క్లిప్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన కొందరు ఆ వ్యక్తిపై ఫైరవుతున్నారు. మరి అంత అర్జెంట్ కాల్ అయితే ఓ పక్కన స్కూటీ ఆపి అటెండ్ అవ్వాల్సింది కదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ లాంటి వల్లే ప్రమాదాలు జరిగేవి. మీకు, ఎదుటివారికి కూడా ఇది డేంజర్. అతనిపై యాక్షన్ తీసుకోవాలని మరొకరు కామెంట్ చేశారు. మా సాఫ్ట్‌వేర్ కష్టాలు ఇలానే ఉంటాయని మరొకరు పేర్కొన్నారు. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అలాంటివి.. కొన్నిసార్లు ఇలాంటివి మాకు తప్పవు అని ఓ బెంగళూరు వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఈ వీడియో మార్చి 23న ట్విట్టర్ పోస్ట్ చేయగా.. లక్ష కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఎంత ఇంపార్టెంట్ కాల్ అయినా ఇలా చేయకూడదు. మీ ప్రాణం అంతకంటే ఇంపార్టెంట్. మరీ మిమ్మల్ని ఇలా కూడా పని చేయించే బాస్ ఉంటే ఆ ఉద్యోగం మానేసి ఇంకోటి వెతుక్కోండి. మీ కోసం ఇంటి వద్ద మీ వాళ్లు ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పిచ్చి పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. జీవితంలోనూ రోడ్డు మీద సేఫ్ జర్నీ చేయండి.