అబ్బా..అబ్బా బహుశా దీనినే ప్రేమ అంటారు అనుకుంటా..! ఈ వీడియోను తప్పకుండా చూడండి.
జనం న్యూస్: తల్లి, బిడ్డల బంధాన్ని వర్ణించలేం. తల్లి తన బిడ్డలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. వారి ఆలనా, పాలనా, లాలన అన్నీ చూస్తుంది. ఇక తండ్రి, బిడ్డల బంధం చాలా విచిత్రమైనది. గుండెనిండా ప్రేమ ఉన్నా.. ఎలా చూపాలో తెలియని అమాయకత్వం తండ్రిది. లోలోతుల్లోని ఆ ప్రేమను కేవలం తన చేతల ద్వారా మాత్రమే చూపుతాడు. తండ్రి తన పిల్లల ప్రతి కదలికను ఆనందిస్తాడు. తన అవసరాలను పక్కనబెట్టి.. తన పిల్లల సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటాడు నాన్న. అందుకే.. తండ్రీ బిడ్డల మధ్య ప్రేమ అత్యంత మధురమైనది. ఓ తండ్రి తొలిసారి తన బిడ్డను చూసినప్పుడు, బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగి ఆనందం, మనసులో ఉప్పొంగే సంతోషం వర్ణించడం సాధ్యం కాదు.తాజాగా ఇలాంటి సంతోషకరమైన, ఉద్వేగభరితమైన సన్నివేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ బేబీ గొరిల్లా తొలిసారి తన తండ్రిని కలుసుకుంది. ఆ క్షణంలో బేబీ గొరిల్లా, తండ్రి గొరిల్లా ప్రవర్తన చూసేందుకు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ఉద్వేగభరితమైన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేశారు. బేబీ గొరిల్లా తొలిసారి తండ్రిని కలిసిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో పిల్ల గొరిల్లా తన తండ్రి ముఖాన్ని మెల్లగా తడుముతూ గుర్తించేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. ఆ రెండు గొరిల్లాల కదలికలు హార్ట్ మెల్ట్ అయ్యేలా ఉన్నాయి.నెట్టింట ఈ వీడియో తెగ వైరలవుతుండగా ఇప్పటివరకూ ఈ క్లిప్‌ను 64,000 మందికి పైగా వీక్షించారు. కామెంట్స్ సెక్షన్ పూర్తిగా హార్ట్, లవ్ ఎమోజీలతో నిండిపోయింది. న్యూరోసర్జన్ భార్యగా నా పిల్లలు తండ్రితో మెలిగే తీరు నాకు తెలుసు.. ఇది కూడా అలాగే ఉంది అని మరో యూజర్ కామెంట్ చేశారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.