ఘోరం.. లోయలో పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.
జనం న్యూస్: ఛత్తీస్‌గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడిపోయింది దీనితో దాదాపు 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు , 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో జరిగింది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు, డిస్టలరీ కార్మికులు తమ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్నపుడు ఈ ప్రమాదం జారింది అని విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించామని ఎస్పి జితేందర్ శుక్ల తెలియజేశారు. ప్రమాదం పై మేజిస్టరైల్ విచారణ చేస్తున్నాము అని ఆయన తెలిపారు. దుర్గ్ లో జరిగిన ఈ ప్రమాదం పై నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఘటన చాల బాధాకరం, ఆత్మీయులను కూలిపోయిన వారికి సానుభూతి ప్రకటిస్తున్నట్టు మోడీ ట్వీట్ చేసారు.