50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

50 యేళ్లు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్

జనం న్యూస్,ఫిబ్రవరి 02 విజయనగరంప్రస్తుతం విశాఖ పట్నం - సికింద్రాబాద్ మద్య భారత దక్షిణ మద్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న గోదావరి రైలు ప్రయాణం మొదలు పెట్టి 50 యేళ్లు పూర్తి చేసుకుంది.ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్ల తో విశాఖ పట్నం - సికింద్రాబాద్ మద్య నడుస్తుంది.1974 ఫిబ్రవరి 1వ తేదీన మొదటి సారిగా ప్రారంభించిన గోదావరి ఎక్స్ ప్రెస్ వాల్తేర్ - సికింద్రాబాద్ మద్య ట్రైన్ నంబర్ 7007 గా, సికింద్రాబాద్ - వాల్తేర్ మద్య ట్రైన్ నంబర్ 7008 గా  ప్రవేశ పెట్టడం జరిగింది.ఈ ట్రైను18 స్టేషన్లో ఆగుతుంది. ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు (440 మైల్స్)సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిముషాలు17 భోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు గంటకు 57 కిలో మీటర్లు (35 మైల్ ఫర్ అవర్) తో ప్రయాణిస్తుంది.ఈ 50 ఏళ్లలో ఎందరో ప్రయాణికులకు ఎన్నో రకాల సేవలు అందించిన ఘనత సాధించిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు.ఈ రోజు సాయంత్రం గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు కు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేయనున్న భారత దక్షిణ మధ్య రైల్వే శాఖ.