ఇంటింటికి అయోధ్య శ్రీ రాముని అక్షింతలు

ఇంటింటికి అయోధ్య శ్రీ రాముని అక్షింతలు

అచ్యుతాపురం(జనం న్యూస్):శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్రం అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అయోధ్య శ్రీ రాముని స్పర్శిత అక్షింతలు వితరణ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. విశ్వవ్యాప్తంగా 2024 జనవరి 1 నుండి 15 వరకు జరిగే శ్రీరామ పూజిత అక్షింతలు వితరణ కార్యక్రమంలో భాగంగా శనివారం చీమలాపల్లి లో ధర్మరక్షా సమితి ఆధ్వర్యంలో భక్తిశ్రద్దలతో హనుమాన్ జెండాలతో ఊరేగింపు గా ఇంటింటికి వెళ్లి అందజేసారు. ఈ కార్యక్రమంలో "సమరసతా సేవా ఫౌండేషన్" ఎలమంచిలి ఖండ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఈ అక్షింతలు పూజామందిరము లో ఉంచుకొని ప్రతిరోజు శ్రీరామ జయరామ జయ జయ రామ అను మంత్రము పఠిస్తూ పూజించాలని ఈ నెల 22 వ తేదీన జరుగు ప్రాణప్రతిష్ట కార్యక్రమం మీ సమీప రామాలయాలలో జరుగు సామూహిక పూజాకార్యక్రమాలు లో పాల్గొని టివీ లో ప్రత్యక్ష ప్రసారం తిలకించాలని సాయంత్రం ప్రతీ ఒక్కరు పూజా మందిరంలో రెండు, గుమ్మానికి ఇరువైపులా రెండు ,తులసి కోట దగ్గర ఒకటి మొత్తం 5 దీపాలు వెలిగించి అనంతరం ఇంటిల్లిపాదీ అక్షింతలు తలపై వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీయాద్రి బుజ్జి, "సమరసతా సేవా ఫౌండేషన్ "యలమంచిలి ఖండ ధర్మ ప్రచారకులు కొల్లి అప్పారావు,

అర్ఎస్ఎస్ 

సిహెచ్ రాజు, మజ్జి రమణ కుమార్ ,తోట శ్రీను, శంకర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.