ఈ సంక్రాంతి ప్రతి ఇంటా సంతోషాన్ని నింపాలి: కలెక్టర్ నాగలక్ష్మి

ఈ సంక్రాంతి ప్రతి ఇంటా సంతోషాన్ని నింపాలి: కలెక్టర్ నాగలక్ష్మి

జనం న్యూస్,జనవరి 14 

విజయనగరంఐదు

ఈ సంక్రాంతి పుణ్య కాలం ప్రతి ఇంటా సంతోషాన్ని

నింపాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి

ఆకాంక్షించారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని

మకర సంక్రమణం అంటారని, ఈ పుణ్యదినాన్నే

సంక్రాంతిగా తెలుగువారు జరుపుకుంటారని

పేర్కొన్నారు. పంట చేతి కొచ్చే సమయంలో,

ఆనందోత్సవాల నడుమ మూడు రోజులు ఘనంగా

జరుపుకునేదే ఈ పండగ అన్నారు. ప్రజలందరికీ భోగి,

సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు.